గుండె సంరక్షణకు సహజ సిద్ధ ఔషధ మూలికలతో లీ లైఫోస్టెరాల్
26 March 2024, 9:26 IST
- గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధ ఔషధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను రూపొందించింది.
గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధ ఔషధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను రూపొందించింది.
హైదరాబాద్, మార్చ్ 25: న్యూట్రాసూటికల్స్ తయారీలో భారత్‌లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన హైదరాబాద్ కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధ ఔషధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను రూపొందించింది.
ఇందులో వెల్లుల్లి సారం, గామా ఒరిజనోల్, ఫైటోస్టెరాల్, లైకోపీన్, పసుపులో ఉండే కుర్కుమిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన పైపెరిన్ సమ్మేళనాలను జోడించారు. హృదయ సంబంధ వ్యాధులలో విస్తృత పరిశోధన తర్వాత లైఫోస్టెరాల్‌కు రూపకల్పన చేసినట్టు లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు.
‘లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ తయారీలో వాడిన బయో యాక్టివ్ సమ్మేళనాలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేయడానికి, క్రమ రహిత హృదయ స్పందనల స్థిరీకరణ కోసం ధమనులలో మృదువైన ఫలకాన్ని తొలగించడానికి అవసరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇంకా ఈ సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి’ అని లీలారాణి చెప్పారు.
‘పాత రోజుల్లో అరవై ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాలు వేగంగా పెరిగాయి. ఆకస్మిక గుండె వైఫల్యాలకు దోహదపడే అంశాలు అనేకం ఉన్నాయి. యువకులలో సరైన జీవనశైలి లేకపోవటం, నియమం లేని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణం అవుతోంది. అలాగే కరోనా సమయంలో విచ్చలవిడిగా ఔషధాలు వాడటం వలన అది గుండె జబ్బులకు దారితీసి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు’ అని లీలారాణి తెలిపారు. అమెజాన్‌తోపాటు ప్రముఖ ఫార్మసీలలో లైఫోస్టెరాల్ లభిస్తుంది. లీ హెల్త్ డొమెయిన్ పోర్టల్ లో కూడా లభిస్తుంది.
జీవనశైలి సంబంధ సమస్యలు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులు, జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారం అందించేందుకు లీ హెల్త్ డొమెయిన్ విస్తృత పరిశోధనతో సహజసిద్ధ మూలికలతో ఔషధాలను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులకు భారత్‌తోపాటు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. స్మూత్‌వాక్, స్పైనోకార్ట్, ఇమ్యునోలాక్ట్, డి-మాక్యులా, ఫ్రీ మెనోసైకిల్, యాక్టివ్ ప్లస్, యాక్టోకిన్, స్టీమ్ మంత్ర, వస తులసి వేటికవే ప్రత్యేకం. లీ నేచురల్ కేర్ పేరుతో స్కిన్, హెయిర్, నెయిల్స్ సంరక్షణ ఉత్పత్తులను సైతం కంపెనీ తయారు చేస్తోంది.