తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వీళ్లకు సెక్స్ అంటే వ్యసనం.. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా

వీళ్లకు సెక్స్ అంటే వ్యసనం.. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా

13 August 2024, 8:01 IST

google News
  • శృంగారం గురించి తరచూ కోరికలు, ఆలోచనలు, కోరికను అదుపులో పెట్టుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ సెక్స్ అడిక్షన్ లక్షణాలే. దీని గురించి వివరాలు తెల్సుకోండి.

సెక్స్ అడిక్షన్
సెక్స్ అడిక్షన్ (freepik)

సెక్స్ అడిక్షన్

కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్.. దీన్నే హైపర్ సెక్సువాలిటీ లేదా సెక్సువల్ అడిక్షన్ అంటారు. శృంగారం విషయంలో తీవ్ర వాంఛలు, కోరికలు, సెక్స్ మీద నియంత్రణ లేకపోవడం లాంటివి దీని సంకేతాలు. ఇలాంటి లక్షణాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. బంధాల మీద ప్రభావం పడుతుంది. పని సరిగ్గా చేయలేరు. సెక్స్ అడిక్షన్ ఉన్నవాళ్లు వాళ్లకు కోరిక కలగగానే అనుకున్నది జరగకపోతే తీవ్రమైన నిరాశకు లోనవుతారు. ఏ పనీ చేయలేరు. సెక్స్ వ్యసనం అనేక బాధలకు దారితీస్తుంది. మీ లైంగిక జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు సెక్స్ అడిక్టా కాదా అనుకుంటున్నారా? ఈ లక్షణాలు తెల్సుకోండి.

సెక్స్ అడిక్షన్ అంటే?

ముఖ్యమైన పనులు వదిలేసి తరచూ శృంగారం మీదే ధ్యాస ఉంటే వ్యసనం ఉన్నట్లే. 2 నుంచి 6 శాతం జనాభాలో ఈ హైపర్ సెక్సువాలిటీ గుణం ఉంటుందని జర్నల్ ఆఫ్ సైకోసెక్సువల్ హెల్త్ సర్వే చెబుతోంది. అవసరం అయిన దానికన్నా ఎక్కువగా శృంగార ఆలోచనలు వీరికి ఉంటాయి.

సెక్స్ అడిక్షన్ కారణాలు:

దీనికి కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ, కొన్ని మాత్రం శృంగార ఈ కోరికలను ప్రేరేపించవచ్చు.

  1. మెదడులో ఎక్కువ స్థాయిలో డోపమైన్ ఉండటం, తక్కువ సెరటోనిన్ స్థాయులు దీనికి కారణం కావచ్చు.
  2. మెదడులో కొన్ని లోపాల కారణంగా స్వీయ నియంత్రణ లక్షణం కోల్పోవడం
  3. అనారోగ్యకర జీవన విధానాలు, సానుకూలత లేని ఆలోచనలు కూడా దీనికి కారణం కావచ్చు.
  4. ఒంటరితనమూ కారణమే
  5. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ మొదలవ్వచ్చు.

సెక్స్ అడిక్షన్ లక్షణాలు:

సెక్స్ అంటే వ్యసనంగా మారినవారు సంతృప్తి పొందలేరు. దానివల్ల తరచూ శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. దీంతో పాటే వాళ్లలో ఉండే లక్షణాలు చూడండి.

1. అనియంత్రిత కోరికలు:

శృంగారం చేయాలనే కోరికను అదుపులో పెట్టుకోలేరు. సెక్స్ గురించి ఆలోచిస్తూ, పార్న్ వీడియోలు చూస్తు, ఆ కోరికలతోనే సమయం గడుపుతారు. హస్త ప్రయోగం మీద నియంత్రణ ఉండదు. తరచూ హస్త ప్రయోగం చేసుకుంటారు. సెక్స్ కోరిక తీర్చుకోడానికి దీన్ని వ్యసనంగా మార్చుకుంటారు. నియంత్రణ కోల్పోతారు.

2. ప్రవర్తన:

శృంగారంలో కోరికల వల్ల భాగస్వామి ఇష్టాన్ని పట్టించుకోరు. గర్భనిరోధక మార్గాలేమీ నచ్చవు. చెప్పాలంటే అలా కోరిక తీర్చుకోవడం కుదరకపోతే మరింకొకరితోనూ శారీరక సంబంధం పెట్టుకుంటారు. దీనివల్ల వ్యక్తిగత బంధంలో, ఉద్యోగంలో సమస్యలొస్తాయి. సుఖం కోసం అనవరమైన వాటికి ఖర్చు పెట్టడం కూడా మొదలుపెడతారు.

3. నిర్లక్ష్యం:

ఉద్యోగాన్ని, బంధాలను పట్టించుకోరు. శృంగార వాంచ కోసమే బతుకుతున్నట్లుంటారు. దానివల్ల ఉద్యోగం ఊడుతుంది. బంధం ముక్కలవుతుంది.

4. ఒత్తిడిగా అనిపించినా, బోర్ కొట్టినా, ఒంటరిగా అనిపించినా అన్నింటికీ శృంగారమే మార్గంగా అనిపిస్తుంది. భావోద్వేగాల నియంత్రణకు సెక్స్ ఒక్కటే మార్గంగా ఫీలవుతారు.

సెక్స్ అడిక్షన్ ట్రీట్మెంట్:

వైద్యులు మెదడును నియంత్రణలో ఉంచడానికి కొన్ని మందులు సూచిస్తారు. ఇవి ఆందోళనను, కోరికలను తగ్గిస్తాయి. కాగ్నిటివ్ బిహేవియలర్ థెరపీ వల్ల కూడా శృంగార కోరికలు అదుపులో ఉండేలా చికిత్స చేస్తారు.

వీటితో పాటే సరైన నిద్ర, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ వల్ల దీన్నుంచి బయటపడొచ్చు. పెయింటింగ్, వ్రైటింగ్, గార్డెనింగ్, మ్యూజిక్ వినడం లాంటివి నేర్చుకోవాలి. వీటి వల్ల ప్రశాంతత ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సెక్స్ అడిక్షన్ ఆరోగ్యకరం కాదు. ఇది వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తుంది.

తదుపరి వ్యాసం