తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas 2022: క్రిస్మస్ ట్రీ, టేబుల్ డెకొరేషన్ ఇలా చేయండి

Christmas 2022: క్రిస్మస్ ట్రీ, టేబుల్ డెకొరేషన్ ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:53 IST

google News
    • Christmas 2022: క్రిస్మస్ సందడి మొదలైంది. క్రిస్మస్ ట్రీ డెకొరేషన్, టేబుల్ డెకొరేషన్ ఎలా చేయాలో చెబుతున్న నిపుణుల సలహాలివి.
క్రిస్మస్ ట్రీ డెకొరేషన్
క్రిస్మస్ ట్రీ డెకొరేషన్ (cottonbro studio)

క్రిస్మస్ ట్రీ డెకొరేషన్

క్రిస్మస్ డెకరేషన్‌లో క్రిస్మస్ ట్రీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతుంది. మెరుపులు, పైన్ సెంట్ ఆకర్షిస్తాయి. హాలిడే డెకరేషన్స్ అన్నింటికీ ఇది కేంద్ర బిందువుగా నిలుస్తుంది.

కరీఘర్స్‌ ఫౌండర్, సీఈవో అభిషేక్ చద్దా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్మస్ ట్రీ అలంకరణ గురించి వివరించారు. ‘క్రిస్మస్ చెట్టు వైభవం ఆ ఇంటి డిజైన్ అభిరుచిని వ్యక్తపరుస్తుంది. మీరు రాచరిక లేదా సంప్రదాయ శైలిని ఎంచుకున్నా లేక మాక్జిమలిస్ట్ థీమ్ ఎంచుకున్నా అది మీ డిజైన్ అభిరుచిని వ్యక్తపరుస్తుంది. మెటాలిక్ ఆర్నమెంట్స్, పైన్‌కోన్స్, ప్రకాశవంతమైన బంతులు, కాగితపు అలంకరణలు క్రిస్మస్ ట్రీకి శోభనిస్తాయి..’ అని వివరించారు.

‘మీ పండగ విందు సెట్టింగ్ మరింత ప్రత్యేకంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలంటే బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద క్రిస్మస్ ట్రీ అలంకరించి ఆహ్లాదాన్ని పంచే సెంటర్ పీసెస్‌ను, టేబుల్ రన్నర్స్‌ను జత చేయండి. ఇంట్లోనే తయారు చేసిన సిట్రస్ ఆర్నమెంట్స్, ఫెయిరీ లైట్స్ జత చేస్తే ఒక భిన్నమైన చెట్టులా శోభనిస్తాయి. షుగరీ డెకొర్ మోటిఫ్, క్యాండీలు, జింజర్ బ్రెడ్ కూడా అలంకరిస్తే అందంగా కనిపిస్తాయి..’ అని వివరించారు.

సిటీస్పేస్ 82 ఆర్టిటెక్ట్స్‌ ప్రిన్సిపల్ ఆర్టిటెక్ట్ సుమిత్ ధావన్ క్రిస్మస్ ట్రీ అలంకరణను వివరించారు. ‘శాంటా బొమ్మలతో కూడిన వింటేజ్ డెకొర్‌ను తలపించేలా క్రిస్మస్ ట్రీని అలంకరించండి. బంగారు, వెండి ఆభరణాలు, దండలు సింపుల్ అండ్ చిక్ క్రిస్మస్ ట్రీకి మరింత వన్నెనిస్తాయి. పాత ప్రైజ్ రిబ్బన్లు పుష్పగుచ్చంగా, లేదా ట్రీ టాపర్‌గా చక్కగా ఉపయోగపడతాయి. డైనింగ్ ఎన్విరాన్‌మెంట్‌కు అనుగుణంగా టేబుల్‌స్కేప్ అలంకరించండి. టేబుల్ డెకొర్‌‌కు సింక్ అయ్యేలా యాక్సెంట్ వాల్‌ను టేబుల్‌పై మధ్యలో అలంకరణకు వాడొచ్చు. ఆకట్టుకునే టేబుల్‌వేర్, మడతపెట్టి ఉంచే టేబుల్‌క్లాత్స్, రంగురంగుల వాటర్ గ్లాసులు, జూట్‌తో చేసిన క్రిస్మస్ థీమ్ గల టేబుల్ రన్నర్స్ క్రిస్మస్ పండగ ప్రత్యేకతను చాటుతాయి. శీతాకాలంలో పూచే పువ్వులతో కూడిన ఫ్లవర్ వాజులు, చిన్నకొవ్వొత్తులు, ఫెయిరీ లైట్స్‌ టేబుల్‌స్కేప్‌కు పండగ శోభను తెస్తాయి..’ అని వివరించారు.

ఆర్కిటెక్ట్ ఆఫ్ వర్క్‌షాప్ ఫర్ మెట్రొపాలిటన్ ఆర్కిటెక్చర్ ఫౌండర్, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ భావన్ కపిల మరిన్ని అలంకరణల గురించి వివరించారు. ‘శీతాకాలాన్ని తలపించేలా మంచు అలంకరణతో కూడిన క్రిస్మస్ ట్రీ కోసం సాఫ్ట్ బ్లష్ ఆర్నమెంట్స్ బాగా పనికొస్తాయి. సాఫ్ట్ కలర్ పలెట్‌తో కూడిన అలంకరణలు క్రిస్మస్ ట్రీపై అద్భుతంగా కనిపించడమే కాకుండా దానిని సెంటర్‌పీస్‌గా ఆకట్టుకునేలా చేస్తాయి. విభిన్న ఆకృతి గల బౌల్స్‌ లేదా చిన్న సిలిండర్ ఆకృతి కలిగిన గాజు బొమ్మల్లో ఆర్నమెంట్స్ నింపడం వల్ల మీ ఇంటీరియర్ అభిరుచికి వన్నెతెస్తుంది. అలంకరణను ప్రకాశవంతం చేయడానికి ఎల్‌ఈడీ మైక్రోలైట్స్ బాగా ఉపయోగపడుతాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో టేబుల్‌‌స్కేప్‌దే ప్రముఖ పాత్ర. సంప్రదాయ ఎరుపు, ఆకుపచ్చల కలయికతో కూడిన టేబుల్ అలంకరణ క్రిస్మస్ స్ఫూర్తిని నింపుతుంది. ప్లెయిన్ రంగులు లేదా టెక్చర్‌తో కూడిన టేబుల్‌క్లాత్స్ సంప్రదాయ అలంకరణకు మ్యాచ్ అవుతాయి. క్రిస్మస్ వేడుకల్లో క్యాండిల్ లైట్స్ సర్వసాధారణమైపోయాయి. మీరు డీఐవై ల్యాంప్స్ లేదా గాజు జాడీలు అలంకరిస్తే పండగ మూడ్‌ను మరింత పెంచుతాయి..’ అని వివరించారు.

తదుపరి వ్యాసం