తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ways To Eat Rice | బరువు తగ్గేందుకు అన్నం మానేస్తున్నారా? సరైన విధానంలో తినొచ్చు

Ways to Eat Rice | బరువు తగ్గేందుకు అన్నం మానేస్తున్నారా? సరైన విధానంలో తినొచ్చు

HT Telugu Desk HT Telugu

06 July 2022, 14:30 IST

    • మీరు అధిక బరువును తగ్గించడం కోసం అన్నం తినలేక కడుపు మాడ్చుకుంటున్నారా? అయితే పూర్తిగా మానేయకుండా సరైన విధానంలో తింటే ఎలాంటి సమస్య ఉండదని డైటీషియన్లు చెబుతున్నారు.
Rice
Rice (Unsplash)

Rice

మనం ప్రతిరోజు ఆహారంలో అన్నం తీసుకుంటాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అన్నమే వండుకొని తింటారు. అయితే అధిక బరువు కారణం అవుతుందని ఇటీవల కాలంగా చాలా మంది అన్నం తినడానికి జంకుతున్నారు. బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేలరీలు ఎక్కువ ఉంటాయని తమ డైట్ నుంచి వైట్ రైస్‌ను దూరం పెట్టేస్తున్నారు. అయితే నిజానికి బరువు తగ్గడం లేదా పెరగటం కోసం అన్నం మానేయాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన రీతిలో తింటే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు

Expensive Potato Chips: ఈ ఆలూ చిప్స్ ప్యాకెట్ కొనాలంటే అందరి తరం కాదు, ఒక్క చిప్ ఎంత ఖరీదో తెలుసా?

Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

అన్నంలోని కార్బోహైడ్రేట్లు మిమ్మల్ని శక్తివంతంగా, సంతృప్తిగా ఉంచగలవు. పాలిష్ చేయని బియ్యంలో B విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, B విటమిన్లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతారని అన్నం తినకుండా ఉండటం తప్పని డైటీషియన్లు అంటున్నారు. సరైన విధానంలో తినాలంటూ కొన్ని మార్గాలను సూచించారు.

1) కూరగాయలు ఎక్కువ తీసుకోండి

అన్నంలో కూరగాయలను ఎక్కువగా కలుపుకొని తినాలి. ఫ్రై కూరలు కాకుండా గ్రిల్ చేసిన కూరగాయలు తీసుకోవచ్చు. అలాగే అధిక-ఫైబర్ లేదా ప్రొటీన్‌ పదార్థాలను కలిపి తీసుకోండి. బీన్స్, ఆస్పరాగస్, బ్రోకలీ లేదా చికెన్ బ్రెస్ట్ వంటివి కలుపుకొని తినవచ్చు. గంజితో పాటుగా, సలాడ్లతో కలిపి అన్నం తినవచ్చు.

2) ఖిచ్డీ తినండి

మనందరం ఖిచ్డీని ఇష్టపడతాము. ఖిచ్డీని పప్పులు, కూరగాయలు, బియ్యం అన్నీ కలిపి చేస్తారు కాబట్టి ఇలా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

3) బాస్మతి బియ్యాన్ని ఎంచుకోండి

సుగంధబరితమైన బాస్మతి బియ్యం తినండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. అయితే సరైన పరిమాణంలో తినడం చాలా ముఖ్యం. ఇక బియ్యంలోనూ రకాలు ఉంటాయి. సాధారణ తెల్ల బియ్యానికి బదులుగా బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, అప్పుడప్పుడు మిల్లెట్లను కూడా అన్నంగా వండుకొని తినాలి.

4) గిన్నెలో తినండి

మీరు అన్నం తిన్నప్పుడల్లా ప్లేట్‌లో కాకుండా చిన్న గిన్నెలో తినండి. ఈ రకంగా అతిగా తినడం నివారించవచ్చు. మీరు బరువు పెరగకుండా ఒకపూట మాత్రమే అన్నం తినండి, మిగతా సమయాల్లో ఇతర ఆహార పదార్థాలను తీసుకోండి. కార్బోహైడ్రేట్లు లేనివి తినండి.

ఇక ఫ్రైడ్ రైస్, బిర్యానీ, బగారా ఇలా వేయించిన అన్నం కాకుండా నీటిలో ఉడికించిన అన్నం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

టాపిక్