తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Rice | బ్రేక్ ఫాస్ట్‌లో అయినా జర్నీలో అయినా టొమాటో రైస్.. వెరీ నైస్!

Tomato Rice | బ్రేక్ ఫాస్ట్‌లో అయినా జర్నీలో అయినా టొమాటో రైస్.. వెరీ నైస్!

HT Telugu Desk HT Telugu

27 June 2022, 8:21 IST

google News
    • ఉదయం అల్పాహారంగా అయినా, మధ్యాహ్నం భోజనంగా అయినా టొమాటో రైస్ ఎంతో ఉత్తమమైన వంటకం. సులభంగా, రుచికరంగా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం.
Tomato Rice
Tomato Rice (Unsplash)

Tomato Rice

టొమాటో రైస్ దక్షిణ భారతదేశంలో అందరు ఇళ్లలో చాలా సాధారణంగానే వండుకునేదే. ఇది ఎంతో సులభమైన, రుచికరమైన వంటకం. ఇది ఎంతో తేలికైన ఆహారం, ఆరోగ్యకరమైనది కూడా. దీనిని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు ఎప్పుడైనా తినవచ్చు. ప్రయాణాలు చేసేటపుడు కూడా భోజనం కోసం టిఫిన్‌లో ప్యాక్ చేయడానికి టొమాటో రైస్ సరైనది.

మంచి ఎరుపు రంగులో ఘుమఘుమ వాసనలతో ఉండే ఈ టొమాటో రైస్ రుచిలో కొంచెం స్పైసీగా, కొంచెం పులుపుతో అద్భుతంగా ఉంటుంది. దీనిని ఒక క్రిస్పీ పాపడ్, బూందీ రైతాతో కలిపి తీసుకోవచ్చు, కొంచెం పెరుగు రైతాను కలిపి తీసుకుంటే అదరహో అనిపిస్తుంది. మరి ఈ టొమాటో రైస్ వంటకాన్ని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏమేం కావాలి? తెలుసుకోవడానికి ఇక్కడ రెసిపీ ఇచ్చాము.. మీరూ ప్రయత్నించండి.

కావాల్సినవి

  • 1 కప్పు తరిగిన టమోటాలు
  • 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్ స్పూన్ కారం
  • 1/2 టేబుల్ స్పూన్ పసుపు
  • 1టేబుల్ స్పూన్ జీలకర్ర,ఆవాలు
  • 1 టేబుల్ స్పూన్ మిరియాలు
  • 1 బిరియాని ఆకు
  • 2 లవంగాలు
  • 2 టీస్పూన్ల నూనె
  • తాజా కొత్తిమీర
  • రుచికి తగినంత ఉప్పు

తయారీ విధానం

1. ముందుగా బియ్యాన్ని కడిగి, నానబెట్టుకొని ఉంచుకోవాలి.

2. ఒక పాన్ తీసుకుని నూనె వేడిచేసి అందులో తక్కువ మంట మీద మసాలా దినుసులు వేయించాలి. ఆపై ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేపుకోవచ్చు.

2. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆపై తరిగిన టొమాటోలు ఉప్పు, పసుపు, కారం పొడి వేసి బాగా కలపాలి.

3. ఈ మిక్స్ కొద్దిగా మెత్తగా మారిన తర్వాత నీరు పోసుకోవాలి.

4. అనంతరం నానబెట్టిన బియ్యాన్ని వేసి అన్నం ఉడికేంత వరకు ఉంచుకోవాలి.

5. చివరగా కొత్తిమీర ఆకులలు వేసి ఆవిరి మీద ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేస్తే టొమాటో రైస్ రెడీ అయినట్లే.

వేడివేడిగా టొమాటో రైస్ తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని ప్యాక్ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం