తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Kajal Diy: రసాయనాలు లేని కాటుక ఇంట్లోనే సిద్ధం.. అమ్మమ్మల కాలం నాటి పద్దతులివే..

Natural Kajal DIY: రసాయనాలు లేని కాటుక ఇంట్లోనే సిద్ధం.. అమ్మమ్మల కాలం నాటి పద్దతులివే..

18 October 2023, 15:30 IST

  • Natural Kajal DIY: కాటుకను ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా ఎలాంటి రసాయనాలు లేని కాటుక ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. 

ఇంట్లోనే కాటుక తయారీ
ఇంట్లోనే కాటుక తయారీ (freepik)

ఇంట్లోనే కాటుక తయారీ

అమ్మాయిలూ, స్త్రీలూ తమ కళ్లకు కాటుక పెట్టుకోనిదే మేకప్‌ పూర్తి కాదంటారు. అందుకనే మార్కెట్లో దొరికే రకరకాల కాజల్స్‌ని బోలెడు డబ్బులు పోసి కొనుక్కుని వాడుతుంటారు. కాటుకను రోజూ కళ్లకు పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కళ్లపై పడకుండా ఉంటాయి. అలాగే కంట్లో ఎర్రటి చారలు, కళ్ల మంటల్లాంటివి తగ్గుతాయి. అయితే కాస్త సమయం వెచ్చించ గలిగితే చాలు. ఎలాంటి రసాయనాలూ లేకుండా చక్కగా సహజమైన కాటుకను మనమే తయారు చేసేసుకుని వాడుకోవచ్చు. మన దేశంలో పూర్వ కాలం నుంచి ఇలా కాజల్‌ని ఇంట్లోనూ తయారు చేసుకునే పద్ధతులు ఉన్నాయి. అమ్మమ్మల కాలం నాటి ఆ విధానాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

కాటుకను తయారు చేసే విధానం:

మూడు చిన్న రాళ్లను పొయ్యి మాదిరిగా పెట్టుకోండి. మధ్యలో ప్రమిదను ఉంచండి. అందులో లావుపాటి ఒత్తిని వేయండి. దాంట్లో ఆముదం పోయండి. దాన్ని వెలిగించండి. ఆ రాళ్లపైన ఓ ఇత్తడి ప్లేటును గాని, రాగి కంచాన్ని గాని కాస్త నూనె రాసి బోర్లించండి. దాదాపుగా ఒక రోజంతా ఆ దీపాన్ని అలా వెలగనివ్వండి. కావాలనుకుంటే మధ్య మధ్యలో ఆముదాన్ని పోస్తూ ఉండండి. ఇలా సాయంత్రం వరకు ఉంచండి. తర్వాత బోర్లించిన పళ్లెం తీసి చూడండి. దానికి కాస్త నల్లటి పొడి లాంటిది దళసరిగా అంటుకుని ఉంటుంది. కాస్త ఆముదం సహాయంతో దాన్ని ముద్దలా చేయండి. ఈ దశలో చాలా కొద్ది ఆముదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ అయితే పల్చగా అయిపోతుంది. కాటుక పెట్టుకున్నప్పుడు అది పాకిపోయి కళ్ల కిందకు వచ్చేస్తుంది. అందుకనే దాన్ని వీలైనంత తక్కువ ఆముదంతో ముద్ద చేసుకోవాలి. చిన్న భరిణలోకి తీసి పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోవచ్చు.

కాటుక చేసే మరో పద్ధతి:

కాటుక తయారు చేసుకోవడానికి మరో విధానాన్ని చూసేద్దాం. పైన చెప్పిన విధంగా మూడు రాళ్లను పొయ్యి మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ మధ్యలో ఆముదపు దీపాన్ని వెలిగించాలి. ఆ చిన్న పొయ్యి మీద ఓ రాగి ప్లేటును బోర్లించి ఉంచాలి. పై వైపున బాదం గింజలను పెట్టాలి. ఓ రెండు గంటల పాటు అలా వదిలేయాలి. తర్వాత ప్లేటు పైన నల్లగా అయిపోయిన బాదాం గింజల్ని మెత్తగా నూరాలి. అందులో ప్లేటు అడుగు భాగంలో పూసిన మసిని గీకి తీసి వేయాలి. ఆ మిశ్రమం అంతా బాగా కలిసేలా చేయాలి. ఆముదం లేదా నెయ్యి సహాయంతో దీన్ని గట్టి ముద్ద మాదిరిగా చేయాలి. దాన్ని ఓ భరిణెలో పెట్టుకుని భద్రపరుచుకోవాలి. అంతే. సహజమైన కాటుక తేలికగా తయారైనట్లే.

టాపిక్

తదుపరి వ్యాసం