తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thepla Recipe: గుజరాతీ రుచికరమైన అల్పాహారం.. మెంతికూరతో చేసే తేప్లాలు..

Thepla Recipe: గుజరాతీ రుచికరమైన అల్పాహారం.. మెంతికూరతో చేసే తేప్లాలు..

10 November 2023, 6:30 IST

google News
  • Thepla Recipe: అల్పాహారంలోకి, మధ్యాహ్న భోజనంలోకి కూడా తినగలిగే గుజరాతీ వంటకం తేప్లా. వీటిని రుచిగా ఎలా చేసుకోవాలో చూసేయండి.

తేప్లా
తేప్లా

తేప్లా

గుజరాత్ స్పెషల్ వంటకం తేప్లా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంలోకి వీటిని చేసుకుని తింటే చాలా బాగుంటాయి. వీటిలో ఎలాంటి మైదా కూడా వాడం. అవసరమైతే వేరే ఆకుకూరలు వేసి కూడా వీటిని చేసుకోవచ్చు. ప్లాట్ ఫాం 65 ఎగ్జిక్యూటివ్ చెఫ్ సురేష్ పర్ఫెక్ట్ గా తేప్లాలు ఎలా చేసుకోవాలో వివరించారు.

కావాల్సిన పదార్థాలు:

• గోధుమ పిండి - 500 గ్రాములు

• ఉప్పు - తగినంత

• కారం పొడి - 5 గ్రాములు

• పసుపు - 1/2 టీస్పూన్

• జీలకర్ర పొడి - 5 గ్రాములు

• నువ్వులు - 5 గ్రాములు

• ఉల్లిపాయ - 1/2 (సగం)

• బెల్లం - 5 గ్రాములు

• కొత్తిమీర - కొద్దిగా

• పెరుగు - రెండు స్పూన్లు

• మెంతి గింజలు (మేతి) - కొన్ని

• నిమ్మకాయలు - రెండు

• నూనె - 2 టీస్పూన్

తయారీ విధానం:

  1. ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి, మెంతి ఆకులని వేసి బాగా కలపండి.
  2. ఇప్పుడు అందులోనే జీలకర్ర పొడి , పసుపు, కారంపొడి, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, బెల్లం వేసి మరోసారి పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా ఓ సారి కలపండి.
  3. ఇందులోనే కొద్దిగా రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు పెరుగు వేసి పిండి మొత్తం బాగా కలిసిపోయేలా కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
  4. కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా చేసుకొని కాస్త మందంగా చపాతీల్లాగా ఒత్తుకోవాలి.
  5. ఒక పెనం పెట్టుకుని వేడెక్కాక ఈ తేప్లాలు వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుని కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకున్నాక ఏదైనా చట్నీతో లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలు.

తదుపరి వ్యాసం