తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Lip Balms: లిప్‌ బామ్లను ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చిలా!

DIY Lip Balms: లిప్‌ బామ్లను ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చిలా!

10 October 2023, 15:00 IST

  • DIY Lip Balms: లిప్ బామ్ అంటే బయటినుంచి కొనుక్కోవాల్సిన పనేలేదు. కాస్త ఓపిక ఉంటే బజార్లో దొరికే పదార్థాలతో సులువుగా లిప్ బామ్ చేసుకోవచ్చు. అదెలాగో మీరూ తెలుసుకోండి. 

లిప్ బామ్ తయారీ
లిప్ బామ్ తయారీ (pexels)

లిప్ బామ్ తయారీ

పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా లిప్‌ బామ్లను వాడుతూ ఉంటారు. ఇవి మన పెదవుల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీంతో పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. యూవీ కిరణాల నుంచి ఇవి వాటికి రక్షణ కల్పిస్తాయి. దీంతో అవి నిగారింపుతో ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న లిప్‌ బామ్లను ఇంట్లో మనమే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మన పెదవుల తీరును ఆధారంగా చేసుకుని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. కాస్త సమయం, ఓపిక ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

లిప్ బామ్ 1:

ఒక టేబుల్‌ స్పూను బీ వ్యాక్స్‌ని తీసుకోండి. దాన్ని సన్నగా తురుముకుని పెట్టుకోండి. అలాగే మరో టేబుల్‌ స్పూను వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ (స్వచ్ఛమైన కొబ్బరి నూనె)ని తీసుకోండి. కొద్దిగా ఆర్గానిక్‌ తేనె, రెండు ‘ఈ విటమిన్‌’ క్యాప్యూల్స్‌ని తెచ్చి పెట్టుకోండి. ఇవి ఉంటే చాలు మనం చక్కగా లిప్‌ బామ్‌ని తయారు చేసేసుకోవచ్చు. అందుకు డబుల్‌ బాయిలింగ్‌ మెథడ్‌ని ఉపయోగించవచ్చు. గ్యాస్‌ మీద గిన్నె పెట్టి అందులో నీటిని పోయండి. దానిలో మరో గిన్నెను పెట్టి అందులో వ్యాక్స్‌ను వేసి కరిగించండి. అది సగం కరిగాక కొబ్బరి నూనెను వేయండి. తర్వాత దానిలో తేనె, విటమిన్‌ ఈ క్యాప్యూల్స్‌లోని ద్రవాన్ని వేయండి. అన్నింటినీ బాగా కలిపి ఒకసారి ఉడుకు పట్టనివ్వండి. తర్వాత గ్యాస్‌ ఆపేసి ఆ వేడి మిశ్రమాన్ని ఓ లిప్‌ బామ్‌ కంటైనర్‌లోకి తీసుకోండి. అది చల్లారిన తర్వాత గట్టిబడుతుంది. ఆ సమయంలో ఓ పూట ఫ్రిజ్‌లో ఉంచుకుంటే సరి. మీ పెదవులు పొడిబారిపోయినట్లు ఎప్పుడు అనిపించినా దీన్ని కాస్త రాసుకుంటే సరిపోతుంది. దీన్ని బేసిక్‌ లిప్‌ బామ్ అని చెప్పవచ్చు.

లిప్ బామ్ 2:

బేసిక్‌ లిప్‌ బామ్‌ను తర్వాత ఏ రంగులో కావాలంటే ఆ రంగులో, ఏ ఫ్లేవర్‌లో కావాలంటే ఆ ఫ్లేవర్‌లో సహజ పదార్థాలతో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టేబుల్‌ స్పూను బీ వ్యాక్స్‌, అర టీ స్పూను ఆముదం, మూడు టీస్పూన్ల రోజ్‌ఆయిల్‌, ఒక టీ స్పూను వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఒక టీ స్పూను కొకోవా పొడి, కాస్త బీట్‌ రూట్‌ పొడులను తీసుకోండి. డబుల్‌ బాయిలింగ్‌ మెథడ్‌లో కాకపోయినా నేరుగా అయినా దీన్ని పొయ్యి మీద పెట్టి చేసుకోవచ్చు. స్టౌ మీద చిన్న గిన్నె పెట్టి అందులో మైనం, ఆముదాలను చేర్చి కరగనివ్వండి. ఇప్పుడు అందులో రంగు కోసం బీట్‌ రూట్‌ పొడిని చేర్చండి. ఇప్పుడు మనం రోజ్‌ లిప్‌ బామ్‌ను తయారు చేస్తున్నామన్న మాట. అందుకనే అందులో రోజ్‌ ఆయిల్‌, సువాసన కోసం వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ను వేసుకోవాలి. తర్వాత అందులో కొకోవా పొడిని వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత స్టౌ ఆపేసి కాస్త చల్లారనిచ్చి కంటైనర్‌లోకి మార్చుకోవాలి. దాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే సెట్‌ అయిపోతుంది. తర్వాత కావాల్సినప్పుడు వాడుకోవడమే. ఇలా ఇష్టానికి తగ్గట్లు వివిధ ఫ్లేవర్లు చేర్చి లిప్ బామ్ చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం