తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salt And Sugar Intake | ఉప్పు, చక్కెరలు ఎక్కువ తింటే గుండెకు నష్టమే, రోజుకు ఎంత తినాలంటే?!

Salt and Sugar Intake | ఉప్పు, చక్కెరలు ఎక్కువ తింటే గుండెకు నష్టమే, రోజుకు ఎంత తినాలంటే?!

HT Telugu Desk HT Telugu

24 May 2023, 11:40 IST

google News
    • Salt and Sugar intake: ఉప్పు ఎక్కువైనా మీ గుండెకు నష్టమే, చక్కెర ఎక్కువైనా గుండెకు నష్టమే. అదనంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా తగ్గించాలి, మితంగా తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
Salt and Sugar intake:
Salt and Sugar intake: (istock)

Salt and Sugar intake:

Salt and Sugar intake: కొంతమంది టీలో చాలా ఎక్కువ చక్కెర వేసుకొని తాగుతారు, స్వీట్స్ కూడా అధికంగా తింటారు. అలాగే ఆహారంలోనూ ఉప్పుకారాలు చాలా తింటారు. గుండె ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం రోజూవారీగా తీసుకునే ఉప్పు, చక్కెరలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. చక్కెర ఎక్కువ తీసుకుంటే అది మిమ్మల్ని ఊబకాయంలోకి నెట్టివేస్తుంది, క్రమంగా మధుమేహం వైపు దారితీస్తుంది, అథెరోస్ల్కెరోసిస్‌ వంటి ధమనుల సమస్యకు కారణం అవుతుంది. ఇవన్నీ మీరు గుండె జబ్బులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.

మరోవైపు, ఉప్పు ఎక్కువ తీసుకున్నా మీ ఆరోగ్యానికి నష్టమే. అదనపు సోడియం మీ రక్తపోటు స్థాయిలను పెంచుతుంది, మీలో కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు ప్రశాంతంగా ఉండలేరు. మానసికంగా, శారీరకంగా ఇది కూడా బలహీనపడతారు. ఇది క్రమంగా గుండె జబ్బులకు కారణం అవుతుంది. రక్తపోటు అనేది అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్య. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీరు ఆహారంలో ఉప్పును చాలా తగ్గించాలి.

అందువల్ల ఉప్పు ఎక్కువైనా మీ గుండెకు నష్టమే, చక్కెర ఎక్కువైనా గుండెకు నష్టమే. అదనంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా తగ్గించాలి, మితంగా తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు, చక్కెరల వినియోగాన్ని ఎలా తగ్గించవచ్చో నిపుణులు కొన్ని సూచనలు చేశారు, అవి ఇక్కడ తెలుసుకోండి.

ఉప్పు తీసుకోవడం ఎలా తగ్గించాలి

  • ఎల్లప్పుడు ఇంట్లో వండిన ఆహారాలు తీసుకోండి. మీ వంటకాలకు అదనపు ఉప్పును వేసే బదులు, హృదయానికి ఆరోగ్యాన్నిచ్చే మూలికలు, మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా కొంత రుచిని పొందవచ్చు.
  • ఎక్కువ ఉప్పు కంటెంట్‌ను కలిగి ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ తాజా మాంసాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.
  • ఉప్పు లేకుండా నీటిని మరిగించండి. సాధారణంగా మనం కూరలు వండేటపుడు ముందుగానే ఉప్పువేసి మరిగిస్తాం. అలాకాకుండా చివరి దశలో ఉప్పు కలపండి. మీరు ఎంత మొత్తం ఉప్పు తింటున్నారనే దానిపై మీకు మరింత నియంత్రణ ఉంటుంది.
  • నొప్పి నివారణ మాత్రలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటి కరిగిపోయే మాత్రల్లో కూడా ఉప్పు ఉంటుందని మీకు తెలుసా? ఒక్కో టాబ్లెట్‌లో 1గ్రా ఉప్పును కలిగి ఉంటాయి. వీటికి బదులుగా క్యాప్సూల్ లేదా ప్రత్యామ్నాయ మందులు సూచించమని మీ వైద్యులను కోరండి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజులో 5 గ్రాములు లేదా ఒక చెంచాకు మించి సోడియం తీసుకోవద్దని సిఫారసు చేస్తుంది.

చక్కెర తీసుకోవడం ఎలా తగ్గించాలి

  • ఒక సాధారణ 250ml గ్లాసు పండ్ల రసంలో ఏడు టీస్పూన్ల వరకు చక్కెర ఉంటుంది. ప్యాకేజ్ చేసిన పండ్ల రసాలకు బదులుగా ఇంట్లో తాజాగా చేసిన జ్యూస్ చక్కెర లేకుండా తాగండి. లేదా లైకోపీన్-ప్యాక్డ్ టొమాటో జ్యూస్‌ని తాగండి. లేదా నీరు అధికంగా తాగండి
  • మీ కప్పు టీ లేదా కాఫీలో చక్కెరను వేయకండి. ఒకవేళ మీరు చక్కెర లేకుండా తాగలేకపోతే, తక్కువ కేలరీల స్వీటెనర్‌ను ఎంచుకోండి. లేదా హెర్బల్ టీలు తాగటం అలవాటు చేసుకోండి.
  • చాక్లెట్లు, ఐస్ క్రీమ్ంలు, స్వీట్లకు బదులుగా పండ్లను తినండి. పండ్లలో కొంత చక్కెర ఉన్నప్పటికీ, అవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో కూడా నిండి ఉంటాయి.
  • నివేదికల ప్రకారం రోజుకి 6 నుంచి 9 టీస్పూన్లకు మించిన చక్కెరను తీసుకోవద్దు. అంటే ఒక వ్యక్తి రోజుకు 30 గ్రాములకు మించి చక్కెర తీసుకోవడం ఆరోగ్యకరం కాదు.

ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నా ఆహారాలను తగ్గించండి. మీ ఆహారాలలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పెంచండి.

తదుపరి వ్యాసం