తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low Salt Diet : మీకు తెలుసా? ఉప్పును ఎంత తగ్గిస్తే.. ఆరోగ్యానికి అంత మంచిదట..

Low Salt Diet : మీకు తెలుసా? ఉప్పును ఎంత తగ్గిస్తే.. ఆరోగ్యానికి అంత మంచిదట..

17 December 2022, 15:00 IST

    • Low Salt Diet : పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ లేదా ఒక టీస్పూన్ ఉప్పు కంటే తక్కువ తినాలని WHO సిఫార్సు చేస్తుంది. రెండు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు.. పెద్దల కంటే తక్కువ ఉప్పు ఇవ్వాలని చెప్తుంది. పిల్లల శక్తి అవసరాల ఆధారంగా ఇది మారవచ్చని తెలిపింది. ఇంతకీ ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?
ఉప్పును తగ్గించి తినండి..
ఉప్పును తగ్గించి తినండి..

ఉప్పును తగ్గించి తినండి..

Low Salt Diet : మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి ఉప్పు చాలా ముఖ్యం. కానీ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి కచ్చితంగా హాని చేస్తుంది అంటున్నారు నిపుణులు. అధిక సోడియం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది సిఫార్సు చేసిన గరిష్ట స్థాయి కంటే ఎక్కువ ఉప్పును తీసుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Chanakya Niti Telugu : మీకు ఈ అలవాట్లు ఉంటే పేదరికంలోనే ఉండిపోతారు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

WHO ప్రకారం.. ప్రపంచ ఉప్పు వినియోగాన్ని సిఫార్సు చేసిన స్థాయికి తగ్గించినట్లయితే.. ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ల మరణాలను నిరోధించవచ్చని తెలిపింది. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో.. ఉప్పు ఎందుకు తక్కువ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటు అదుపులో ఉంచుతుంది

శరీరం పనిచేయడానికి తక్కువ మొత్తంలో సోడియం మాత్రమే అవసరం. కానీ చాలా మంది దానిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ ఉప్పు తీసుకుంటే.. మీకు రక్తపోటు సమస్య అంత ఎక్కువగా ఉంటుంది.

ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకాలకు దారి తీస్తుంది. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎముకల ఆరోగ్యానికై..

ఎముకల దృఢత్వానికి కాల్షియం ముఖ్యమైనది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అందువల్ల బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. ఎందుకంటే మూత్రవిసర్జన సమయంలో మనం కాల్షియం కోల్పోతాము.

ఈ నష్టం మొత్తం మన శరీరంలోని సోడియంపై ప్రభావం చూపిస్తుంది. మనం ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు.. మూత్రవిసర్జన ద్వారా ఎక్కువ కాల్షియం కోల్పోతాము.

క్యాన్సర్ ప్రమాదాన్ని ఆపుతుంది..

అధిక ఉప్పు ఆహారం కడుపుతో సహా కొన్ని రకాల క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉంటుంది. అనేక పరిశోధన అధ్యయనాలు ఉప్పు కడుపు శ్లేష్మ పొరను దెబ్బతీస్తుందని, గాయాలకు కారణమవుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే.. క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

తక్కువ ఉప్పు, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉబ్బరం వచ్చే అవకాశాలు తక్కువ..

మీరు ఎంత తక్కువ ఉప్పు తీసుకుంటే.. మీ జీర్ణవ్యవస్థకు అంత మంచిది. ఉప్పు ఉబ్బరానికి కారణమవుతుందని ఇప్పటికీ కనుగొనలేదు. కానీ.. ఉప్పులో ఉండే సోడియం, నీరు నిలుపుదలకి కారణమవుతుందని చెప్పవచ్చు.

దీని వల్ల కడుపు ఉబ్బరం మాత్రమే కాకుండా ముఖం కూడా ఉబ్బుతుంది. మీరు తరచుగా ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

మెదడు ఆరోగ్యానికై..

అధిక ఉప్పు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అభిజ్ఞా బలహీనతకు దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు మూసుకుపోవడం లేదా కుంచించుకుపోతాయి. దీని వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఇది మెదడును తేలికపాటి గందరగోళానికి గురిచేస్తుంది.

కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో కాస్త ఉప్పు తగ్గించి తీసుకోండి. ఉప్పు వంటకాలకు రుచిని ఇస్తుంది. కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది కూడా వాస్తవమే.

టాపిక్

తదుపరి వ్యాసం