తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Baby Caring | శిశువులకు ఎలాంటి ప్రత్యేకమైన సంరక్షణ ఉండాలి?

Tips for Baby Caring | శిశువులకు ఎలాంటి ప్రత్యేకమైన సంరక్షణ ఉండాలి?

HT Telugu Desk HT Telugu

07 June 2022, 15:11 IST

google News
    • World Caring Day - సరైన సంరక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా పసిపిల్లలకు ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి. వేడి వాతావరణంలో శిశువులకు ఎలాంటి కేరింగ్ ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
Baby Caring
Baby Caring (Unsplash)

Baby Caring

జూన్ ప్రారంభమైనా ఎండలు ఇంకా దంచి కొడుతున్నాయి. పెద్దవాళ్లే ఈ ఎండలకు తాళలేకపోతున్నారు అలాంటిది చిన్నపిల్లలు ముఖ్యంగా నవజాత శిశువులు ఈ వేడిని అస్సలు తట్టుకోలేరు. కాబట్టి వారి కోసం ప్రత్యేకమైన కేరింగ్ తీసుకోవాలి. కొత్తగా తల్లిదండ్రులుగా ఉద్యోగం పొందిన వారికి తమ పిల్లల విషయంలో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై అవగాహన ఉండకపోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లు చెబుతారు. కానీ ఈరోజుల్లో ఉద్యోగాలు చేసుందుకు ఎక్కడెక్కడికో తరలిపోవాల్సి వస్తుంది. చెప్పేవారు ఉండరు. అందుకే పసిపిల్లల సంరక్షణ గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వేడి వాతావరణంలో శిషువులకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వారికి వేయాల్సిన దుస్తులు, వారి చర్మ సంరక్షణ, అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎలా చూసుకోవాలి అనే అంశాలపై డాక్టర్లు కొన్ని సూచనలు అందించారు. అవేంటో తెలుసుకోండి.

గది వాతావరణం

పిల్లలను మరీ వేడి ప్రదేశంలో ఉంచరాదు, అలాగే మరీ చల్లని ప్రదేశంలో ఉంచరాదు. వారికి సాధారణ ఉష్ణోగ్రతను కల్పించాలి. ఏసి ఉంటే 26 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత అడ్జస్ట్ చేయాలి. నేరుగా ఫ్యాన్ కింద లేదా కూలర్స్ ఎదురుగా పసిపిల్లలను ఉంచితే వారికి శ్వాస ఇబ్బందులు తలెత్తవచ్చు. గదిలో వేడి గాలి లేకుండా చూసుకోవాలి. వెంటిలేషన్ సరిగ్గా ఉంచాలి. ఉదయం వేళలో, అలాగే సాయంత్రం వేళలో కిటీకీలు అన్ని తెరిచి ఉంచితే వేడిగాలి బయటకు వెళ్లిపోయి స్వచ్ఛమైన గాలి లోపలికి ప్రసరిస్తుంది.

దుస్తులు

శిశువుకు తేలికైన, వదులుగా ఉండేలా బట్టలు వేయాలి. మెత్తని కాటన్ దుస్తులు వేయడం వలన ఇవి చెమటను పీల్చుకొని చర్మానికి గాలి ఆడేలా చేస్తాయి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. పిల్లల చర్మంపై దోమలు కుట్టకుండే ఉండే మస్కిటో రిపెల్లెంట్ క్రీములు రాయకూడదు. బదులుగా దోమ తెరలను వాడాలి. వీరిని బయటకు తీసుకెళ్లాల్సి వస్తే తలకు టోపితో పాటు కాళ్లు, చేతులు కప్పిఉంచే వదులైన వస్త్రాలు వేయాలి.

ఆయిల్ మసాజ్

శిషువులకు ప్రతిరోజూ శరీరం అంతా తేలికపాటి బేబీ ఆయిల్స్ తో మృదువుగా మసాజ్ చేయించి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో వారికి శుభ్రంగా స్నానం చేయించాలి లేదా స్పాంజ్ బాత్ చేయించాలి. ఇలా చేస్తే శిషువుల్లో నరాల అభివృద్ధి జరుగుతుంది, హాయిగా నిద్రపోతారు. వాతావరణం వేడిగా ఉంటే ఉదయం, సాయంత్రం రెండు సార్లు చేయించడం మంచిది. వేప నూనె, నీలగిరి తైలం లాంటి సహజసిద్ధమైన నూనెలను కొన్నిచుక్కలు నీటిలో కలిపి స్నానం చేయిస్తే చర్మంపై క్రిములు నశించి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవు.

హైడ్రేషన్

పిల్లలకు తల్లి పాలకు మించిన శ్రేష్ఠమైన ఆహారం లేదు. తల్లి పాలు పడుతున్నప్పుడు శిషువుకి ప్రత్యేకంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. కాబట్టి సమయానుసారంగా పిల్లలకు సరిపడినంతా బ్రెస్ట్ మిల్క్ అందించాలి. అయితే పాలిచ్చే తల్లి ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉండాలి. ఇందుకోసం తల్లి తగినన్ని నీళ్లు, పండ్లరసాలు, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. అలాగే శిషువుల్లో మూత్ర విసర్జన సాధారణంగా రోజుకు 6 మరియు 8 సార్లు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే వారిని హైడ్రేట్ చేయాలి. ఒకవేళ తల్లిపాలు ఉపయోగించని పక్షంలో సీసా పాలను రీఫ్రజరేట్ చేయాలి. గది ఉష్ణోగ్రత వద్ద 3 గంటల కంటే ఎక్కువ సేపు నిల్వ ఉంచిన పాలను పసివాళ్లకి అందించకూడదు. (Also Read This మార్కెట్లో బ్రెస్ట్ మిల్క్ )

చివరగా..

మీ బిడ్డ అధిక జ్వరం కలిగి ఉంటే, నీరసంగా, చిరాకుగా ఉంటే, ఆరు గంటలకు మించి మూత్రవిసర్జన చేయకపోతే లేదా తినడానికి నిరాకరించినట్లయితే మీరు వెంటనే మీ శిషువుని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

తదుపరి వ్యాసం