Low cost blouses: వెయ్యి కన్నా తక్కువకే బ్లవుజుకు వర్క్ ఇలా వేయించుకోవచ్చు.. వేల ఖర్చుతో మగ్గం వర్క్ అక్కర్లేదు
21 July 2024, 16:30 IST
Low cost blouses: మగ్గం వర్క్ బ్లవుజుల కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? ప్రస్తుతం వాటికి బదులుగా ట్రెండ్ అవుతున్న మోడల్స్ ఏంటో చూడండి. మగ్గం వర్క్ బ్లవుజుల కోసం వేల రూపాయలు పెట్టకండి.. దాన్ని మించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవే
మగ్గం వర్క్ బ్లవుజుకు ప్రత్యామ్నాయాలు
మగ్గం వర్క్ బ్లవుజుల కోసం వేల కొద్దీ ఖర్చు పెట్టాల్సిందే. రెండు నుంచి మూడు వేల రూపాయలు పెట్టినా కూడా వర్క్ చాలా సింపుల్ గానే ఉంటుందని చెప్పాలి. ఇక పెళ్లి బ్లవుజులు, ప్రత్యేక వేడుకల కోసం మగ్గం వర్క్ చేయించుకుంటే ధర ఎన్ని వేలల్లో ఉంటుందో చెప్పలేం. కానీ అంతకన్నా చాలా తక్కువ ధరలోనే, చెప్పాలంటే వంద నుంచి 500 రూపాయల్లో మగ్గం వర్క్ మించి లుక్ ఇచ్చే బ్లవుజులు డిజైన్ చేయించుకోవచ్చు. అదెలాగో చూడండి.
హ్యాండ్ పెయింటెడ్ బ్లవుజులు:
బ్లవుజు మీద చీరకు మ్యాచింగ్ అయ్యేలా పువ్వులు, ఆకారాలు, చెప్పాలంటే ముఖాకృతులు కూడా పెయింట్ వేసిస్తున్నారు. బారసాల ఫంక్షన్ కి దానికి తగ్గట్లే చిన్ని కృష్ణుని ఫొటో, పెళ్లికయితే వధూవరులున్న పెయింటింగ్ వేసిస్తారు. చీరకు మ్యాచ్ అయ్యేట్లు దాని మీదున్న రంగులు ఆకారాలు వేసిస్తారు. వీటి ధర వెయ్యి లోపే ఉంటుంది. దీనికి చాలా సింపుల్ గా చేతి ఎంబ్రాయిడరీ వేయించుకున్నా మంచి లుక్ వస్తుంది.
మెషీన్ ఎంబ్రాయిడరీ:
మెషీన్ ఎంబ్రాయిడరీ చేసి బ్లవుజులు అచ్చం మర్గం వర్క్ చేసినట్లే ఉంటాయి. 500 రూపాలయలు పెడితే చాలు. మంచి వర్క్ వచ్చేస్తుంది. కాస్త ధర పెరిగితే వీటిలోనూ సీక్వెన్లు, మంచి ఆకారాలున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు వేసిస్తారు. చాలా తక్కువ ధరకే బ్లవుజు వర్క్ పూర్తయిపోతుంది. మగ్గం వర్క్ కోసం పెట్టే ఖర్చు పెట్టాలే కానీ అద్బతంగా మెషీన్ ఎంబ్రాయిడరీ చేసిస్తారు.
బనారస్ బ్లవుజు:
బ్రొకేడ్, బనారస్ లాంటి బ్లవుజులను కుట్టించుకుని చూడండి. చీర లుక్ మారిపోతుంది. ముఖ్యంగా ప్లెయిన్ చీరల మీదికి వీటినే ఎంచుకోవచ్చు. నాణ్యమైన బనారస్ ఫ్యాబ్రిక్ ధర వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. అంతకన్నా తక్కువే ఉండొచ్చు కొన్ని చోట్లా. ఒక మీటర్ క్లాత్ తీసుకున్నారంటే మీకిష్టమైన డిజైన్ పెట్టి కుట్టించుకోవచ్చు. వీటి లుక్ ముందు మగ్గం వర్క్ బ్లవుజు లుక్ తక్కువే అని చెప్పొచ్చు.
వర్క్, ప్రింట్ ఫ్యాబ్రిక్స్:
సాదాసీదా చీరలు కూడా ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ ప్రింటెడ్ లేదా వర్క్ బ్లవుజులను ఎంచుకోవచ్చు. రకరకాల ప్రింట్లు,రంగులున్న ఫ్యాబ్రిక్స్, సీక్వెన్స్, కుందన్ల వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ చాలా సులభంగా దొరుకుతున్నాయి. వాటి ధర 100 రూపాయల నుంచి మొదలవుతుంది. వాటితో చీరకు నప్పే డిజైనర్ బ్లవుజు కుట్టించుకున్నారంటే లుక్ చాలా బాగుటుంది. అంతే కాక చాలా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ముందే వర్క్ చేసిన బ్లవుజులు, బ్లవుజు పీసులు అమ్ముతున్నారు. వాటి ధర 500 రూపాయల నుంచి వెయ్యి లోపే ఉంటుంది. వాటి లుక్ కూడా బాగుంటోంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్