Kia Cars | సోనెట్, సెల్టోస్ కార్ల అప్‌డేట్.. ధరలు రూ. 7 లక్షల నుంచి ప్రారంభం!
11 April 2022, 11:34 IST
- కియా కంపెనీ ఇండియాలో తమ సోనెట్, సెల్టోస్ కార్లను అప్‌డేట్ చేసి కొత్తగా లాంచ్ చేసింది. వీటి ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.15 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మిగతా వివరాలు చూడండి..
Kia Sonet
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ తయారీదారు సంస్థ కియా తాజాగా భారత మార్కెట్లో సోనెట్, సెల్టోస్ కార్లను అప్‌డేట్ చేసి కొత్తగా లాంచ్ చేసింది. ఈ కొత్త కియా సోనెట్ సబ్-కాంపాక్ట్ SUV పెట్రోల్, డీజిల్ వెర్షన్ లలో లభిస్తుంది. ఇండియాలో కియా సోనెట్ పెట్రోల్ వెర్షన్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.15 లక్షల నుంచి ప్రారంభమయి రూ.13.09 లక్షల వరకు వివిధ వేరియంట్లలో లభ్యమవుతుండగా.. డీజిల్ వెర్షన్ కార్లు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 8.89 లక్షల నుంచి ప్రారంభమయి వేరియంట్ ను బట్టి రూ. 13.69 లక్షల వరకు ఉన్నాయి.
అదనంగా వచ్చిన ఫీచర్లను పరిశీలిస్తే 2022 కియా సోనెట్ శ్రేణిలో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్ TPMS) ఉన్నాయి. అంతేకాకుండా, దాని అన్ని iMT వేరియంట్‌లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), బ్రేక్ అసిస్ట్ (BA) అలాగే హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC) అమరికలు ఉన్నాయి. కంపెనీ మిడ్-స్పెక్ వేరియంట్‌లలో కూడా రెండు కొత్త కలర్ స్కీమ్‌లు, కొన్ని టాప్-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది.
అయితే సోనెట్ కారులో ఇంజన్ కెపాసిటీ, పవర్‌ట్రెయిన్ ఛాయిస్ లకు సంబంధించి ఎలాంటి మార్పులు లేవు.
Kia Seltos Updates
కియా సెల్టోస్ కారు కూడా అప్‌డేట్ అయింది. గతంలో టాప్ ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న అదనపు ఫీచర్‌లు ఇప్పుడు ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లలో కూడా లభించనున్నాయి. కొత్త సెల్టోస్ SUV కూడా పెట్రోల్, డీజిల్ వెర్షన్ లలో లభిస్తుంది.
భారత మార్కెట్లో 2022 కియా సెల్టోస్ కారు పెట్రోల్ వెర్షన్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 10.19 లక్షల నుంచి ప్రారంభమై రూ.18.15 లక్షల వరకు వివిధ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అలాగే డీజిల్ వెర్షన్ కియా సెల్టోస్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.09 లక్షల నుంచి ప్రారంభమై రూ.18.45 లక్షల వరకు వేరియంట్స్ ఉన్నాయి.
కొత్త అప్‌డేట్‌లను పరిశీలిస్తే..సెల్టోస్ 1.5-లీటర్ డీజిల్ HTK+ వేరియంట్‌లో ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT)తో అందుబాటులో ఉంది. కియా SUV వేరియంట్‌లలో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ESC, VSM, BA, HAC ఇంకా ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్‌లను ప్రామాణికంగా అందిస్తుంది.
అలాగే HTX+ , GTX (O) వేరియంట్‌లు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చాయి. ప్యాడిల్ షిఫ్టర్‌లు, మల్టీ-డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌లు HTX IVT/AT, GTX+ AT/DCT ఇంకా X లైన్ AT/DCT ట్రిమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంపీరియల్ బ్లూ , స్పార్క్లింగ్ సిల్వర్ అనే రెండు కొత్త కలర్ ఛాయిస్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
టాపిక్