తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Khichdi: ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో కిచిడీ చేసుకుని తినండి, రోజంతా శక్తి అందుతుంది

Khichdi: ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో కిచిడీ చేసుకుని తినండి, రోజంతా శక్తి అందుతుంది

Haritha Chappa HT Telugu

09 February 2024, 6:00 IST

google News
    • Khichdi: బ్రేక్‌ఫాస్ట్‌లో బలమైన ఆహారాన్ని తింటేనే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఓసారి ఇలా కిచిడీ చేసుకుని తిని చూడండి. మీకు రోజంతా శక్తి అందుతుంది.
కిచిడీ సింపుల్ రెసిపీ
కిచిడీ సింపుల్ రెసిపీ (youtube)

కిచిడీ సింపుల్ రెసిపీ

Khichdi: బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం వండాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఇక్కడ ఇచ్చిన కిచిడీ రెసిపీని ప్రయత్నించండి. పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీగానే కాదు, లంచ్‌కి కూడా పనికొస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కిచిడిని అల్పాహారంలో తింటే రోజంతా శక్తి అందుతూనే ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. దీని టేస్టు చాలా బాగుంటుంది. ఈ కిచిడీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

కిచిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - ఒక కప్పు

పెసరపప్పు - అరకప్పు

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

జీలకర్ర - అరస్పూను

ఇంగువ - చిటికెడు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - తగినంత

నీళ్లు - సరిపడినన్ని

కిచిడి రెసిపీ

1. బియ్యాన్ని, పెసరపప్పును ముందుగానే శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

2. ప్రెషర్ కుక్కర్ను స్టవ్ మీద పెట్టి నెయ్యి లేదా నూనె వేయాలి.

3. నూనెలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి.

4. నిలువుగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి. అలాగే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేయించాలి.

5. తర్వాత టమోటో తరుగును కూడా వేసి వేయించాలి.

6. టమోటాలు మెత్తబడే వరకు పైన మూత పెట్టాలి.

7. టమోటాలు మెత్తగా ఇగురులాగా అయ్యాక పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.

8. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును వేసి కలుపుకోవాలి.

9. రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. అది ఉడకడానికి సరిపడా నీటిని వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేయాలి.

10. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. మూత తీసాక పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

11. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో వేడిగా తింటే ఎంతైనా తినాలనిపిస్తుంది.

మన భారతీయ వంటకాలలో కిచిడీది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా చలికాలంలో కిచిడిని అధికంగా తినే వారి సంఖ్య ఎక్కువ. అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తినేందుకు ఇది బాగుంటుంది. అంతే కాదు దీనిలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి అల్పాహారంలో తింటే రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఒకరోజు ఈ కిచిడిని బ్రేక్ ఫాస్ట్ లో తిని చూడండి. ఆరోజు మీలో వచ్చే మార్పులు గమనించండి.

టాపిక్

తదుపరి వ్యాసం