Banned Dog Breeds: ఈ జాతి కుక్కలను పెంచడం చాలా డేంజర్, వీటిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది
21 March 2024, 7:00 IST
- Banned Dog Breeds: కుక్కలను ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అన్ని రకాల కుక్కలను ఇంట్లో పెంచుకోకూడదు. మనదేశంలో కొన్ని కుక్క జాతులపై ప్రభుత్వం నిషేధం విధించింది.
మనదేశంలో పెంచకూడని కుక్కలు ఇవే
Banned Dog Breeds: మనదేశంలో కుక్క దాడి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని జాతుల కుక్కలు చాలా ప్రమాదకరమైనవి. అలాంటి వాటిని ఇంట్లో పెంచుకోవడం, వీధుల్లో తిప్పడం, దిగుమతి చేసుకోవడం, అమ్మడం నిషేధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు లేఖ రాసింది. మీరు కుక్కని పెంచుకోవాలనుకుంటే ఏ జాతి కుక్కలను పెంచకూడదో తెలుసుకోండి. ఇవి పెంచడం మీకు కూడా డేంజర్. వాటి దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని జాతుల కుక్కలు పెంచిన యజమానులపై దాడి చేసి చంపేస్తాయి కూడా. కాబట్టి ఎలాంటి కుక్కలను పెంచకూడదో, ఆ జాతుల పేర్లను ఇక్కడే ఇస్తున్నాం.
పిట్‌బుల్, రాట్ వీలర్‌తోపాటు అనేక క్రాస్ బ్రీడ్లు ఉన్నాయి. ముఖ్యంగా పిట్‌బుల్, రాట్ వీలర్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి బలమైన దంతాలతో మనుషుల్ని కొరికి పడేస్తాయి. వీటితోపాటు ఇంకా అనేక కుక్క జాతులు ఉన్నాయి. మన దేశంలో ఏ కుక్కలను పెంచకూడదో కేంద్ర ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేసింది. అవేమిటంటే...
1. పిట్‌బుల్ టెర్రియర్
2. అమెరికన్ స్టాఫోర్డ్ షైర్ టెర్రియర్
3. ఫిలా బ్రసిలీరో
4. టోసా ఇను
5. డోగో అర్జెంటీనో
6. బోయెస్ బోయెల్
7. అమెరికన్ బుల్ డాగ్
8. సౌత్ రష్యన్ డాగ్
9. కనగల్
10. సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్
11. టోరంజక్
12. సర్ఫ్లానినాక్
13. కాకేసియన్ షెపర్డ్ డాగ్
14. మాస్టిఫ్స్
15. జపనీస్ టోసా, అకిటా
16. రోట్ వీలర్
17. బండోగ్
18. కేన్ కోర్సో
19. మాస్కో గార్డ్
20. అక్బాష్
21. కానరియో
22. వోల్ఫ్ డాగ్స్
23. రోడేసియన్ రిడ్జ్ బ్యాక్
పైన చెప్పినా కుక్కల జాబితాలోని ఉన్న శునకాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీరు ఎంతగా వాటిని పెంచినా కూడా అవి మీ పైనా లేదా ఇతరుల పైనా దాడి చేసే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో పైన చెప్పిన ఏ కుక్క జాతులను ఉంచకండి. అవి కొన్ని రకాల శబ్దాలకు, ఆకలికి తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. ఎదురుగా ఉన్న యజమానిపై కూడా తీవ్ర కోపాన్ని చూపిస్తాయి. రాట్ వీలర్ కుక్కలు యజమానిని చంపిన సంఘటనలు మనదేశంలోనే జరిగాయి.
కుక్కలు కరవడం వల్ల అనేక రకాల వైరస్‌లు కూడా శరీరంలో చేరుతాయి. ముఖ్యంగా రాబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
టాపిక్