తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు ప్రతిరోజు గుప్పెడు తినండి చాలు, ఈ రోగాలు రమ్మన్నా రావు

Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు ప్రతిరోజు గుప్పెడు తినండి చాలు, ఈ రోగాలు రమ్మన్నా రావు

Haritha Chappa HT Telugu

24 October 2024, 16:30 IST

google News
    • Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ అదుపులో ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మొలకెత్తిన మెంతులను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.
మొలకెత్తిన మెంతులు ఉపయోగాలు
మొలకెత్తిన మెంతులు ఉపయోగాలు

మొలకెత్తిన మెంతులు ఉపయోగాలు

మొలకెత్తిన మెంతులను ఇప్పుడు సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆహారాల్లో ఈ మొలకెత్తిన మెంతులు కూడా ఒకటి. ఒకప్పుడు మొలకెత్తిన పెసలు, కొమ్ము సెనగలు వంటివే అధికంగా తినేవారు. ఇప్పుడు మొలకెత్తిన మెంతులను కూడా సలాడ్లలో భాగం చేసుకుంటున్నారు. ఆయుర్వేదంలో మెంతులు, మధుమేహ రోగులకు దివ్యౌషధం అని చెబుతారు. ప్రతిరోజూ రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని చెబుతారు. నిజానికి ఆ నీటిని తాగడమే కాదు, మొలకెత్తిన ఆ మెంతులను కూడా తినడం వల్ల శరీరంలో ఎన్నో రోగాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.

మొలకెత్తిన మెంతులు ఉపయోగాలు

మొలకెత్తిన మెంతులు సూపర్ ఫుడ్‌గా ఎలా మారాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొలకెత్తిన మెంతుల్లో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి వీటిలో నిండుగా ఉంటాయి. అలాగే కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ వంటివి కూడా లభిస్తాయి. మొలకెత్తిన మెంతులను క్రమం తప్పకుండా తింటే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం సులభంగా మారుతుంది. సలాడ్లు వంటివి తినేటప్పుడు గుప్పెడు మొలకెత్తిన మెంతులను కూడా కలుపుకొని తినండి.

ఆహారాన్ని కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా తినాల్సి వస్తుంది. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి మెంతులు. మొలకెత్తిన మెంతులను ప్రతిరోజు గుప్పెడు తింటే చాలు. మీ శరీరానికి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. జీవక్రియను మెంతులు పెంచుతాయి. దీనివల్ల జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలు ఏవి రావు. శరీరంలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం నుండి తొలగించడంలో మొలకెత్తిన మెంతులు ముందుంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటివి వాటిని ఇవి తగ్గిస్తాయి.

మొలకెత్తిన మెంతులలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. గుప్పెడు మొలకెత్తిన మెంతులు తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తక్కువగా తింటారు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. మొలకెత్తిన మెంతుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని ఇది బలపరుస్తుంది. ఇవి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యతను కాపాడతాయి. మెనోపాజ్‌తో బాధపడే మహిళలకు మొలకెత్తిన మెంతులు ఎంతో ఉపయోగకరం. ఈ మొలకెత్తిన మెంతుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దంతాలు, ఎముకులను బలోపేతం చేయడంలో ఇవి ముందుంటాయి.

ఎన్నిరోజులు మొలకెత్తుతాయి?

మెంతులు మొలకెత్తాలంటే మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తీసి ఒక కాటన్ వస్త్రంలో చుట్టాలి. వాటిని రెండు మూడు రోజులు పాటు అలా వదిలేస్తే మెంతులు మొలకెత్తుతాయి. వాటిని సలాడ్లలో చల్లుకొని తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ గుప్పెడు మెంతులు కావాలనుకుంటే వాటిని రెండు మూడు రోజుల ముందే నానబెట్టి మొలకెత్తే విధంగా చేసుకోవాలి. ఇలా మొలకెత్తిన మెంతులను ప్రతిరోజూ తిని చూడండి. మీ శరీరంలో ఎన్నో మార్పులు గమనిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీరం చురుగ్గా మారుతుంది. మీకు ఉన్న చాలా ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం