తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jio Fiber | జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఇంటర్నెట్ రౌటర్, సెటప్ బాక్స్ ఫ్రీ!

Jio Fiber | జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఇంటర్నెట్ రౌటర్, సెటప్ బాక్స్ ఫ్రీ!

HT Telugu Desk HT Telugu

21 April 2022, 15:57 IST

google News
    • రిలయన్స్ జియో బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 10 వేల వరకు విలువ చేసే పరికరాలను ఉచితంగా అందిస్తుంది. కనెక్షన్ పొందిన తర్వాత అపరిమిత వినోదం తక్కువ ధరలకే అందిస్తోంది, ఆ వివరాలు... జియో కస్టమర్లకు ఉచిత ఆఫర్లు.. ఇంటర్నెట్ రౌటర్, సెటప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్ అన్నీ ఫ్రీ!
Jio Fiber
Jio Fiber (Stock Photo)

Jio Fiber

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన వినియోగదారుల కోసం 'ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా' పేరిట అనేక కొత్త ప్లాన్‌లను, ఉచిత ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా జియో ఫైబర్ జీరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికోసం ఉచితంగా ఇంటర్నెట్ రూటర్, ఉచితంగా సెట్ టాప్ బాక్స్, అలాగే ఇన్‌స్టాలేషన్ కూడా ఉచితం అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఎవరైనా JioFiber కోసం కనెక్షన్ కోరితే ఎలాంటి ఛార్జ్ లేకుండానే సెట్ టాప్ బాక్స్, ఇంటర్నెట్ హోమ్ గేట్‌వే, ఇన్‌స్టాలేషన్ అన్నీ ఉచితం అంటూ ప్రకటించింది. వీటి విలువ సుమారు రూ. 10 వేలు అని తెలిపింది.

ఇక ఇప్పటికే JioFiber వినియోగదారులైతే వారికోసం ఏప్రిల్ 22 నుంచి కొత్త ప్లాన్‌లు అమలులోకి వస్తాయని జియో వెల్లడించింది.

JioFiber ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా

  • పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం JioFiber ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రకటించింది. దీని ప్రకారం కస్టమర్లు ఇప్పుడు వారు ఉన్న ప్లాన్ లోనే రూ. 100 అదనంగా చెల్లించడం ద్వారా అపరిమిత వినోదం పొందుతారు.
  • నెలకు కేవలం రూ. 100 నుంచి 200 అదనంగా చెల్లించడం ద్వారా Disney+ Hotstar, Zee5, Sonyliv సహా మొత్తంగా 14 ఎంటర్‌టైన్‌మెంట్ OTT యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
  • నెలకు రూ. 399 నుంచి ప్రారంభమయ్యే అపరిమిత హై-స్పీడ్ ఇంటర్నెట్‌ ప్లాన్ కలిగిన వినియోగదారులు ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా ప్లాన్ పొందెందుకు అర్హులు.
  • జియో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారే వినియోగదారులు లేదా కొత్తగా జియో పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకునే వారు అలాగే ఇప్పటికే ఉన్న పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ జియో ఫైబర్ ఉచిత బొనాంజా ఆఫర్లు వర్తించనుండటం గమనార్హం.

టాపిక్

తదుపరి వ్యాసం