తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ట్రెం‌డ్‌కు తగినట్లుగా విద్యావిధానంలో మార్పు రావాలి, అప్పుడే భవిష్యత్ ఉజ్వలం!

ట్రెం‌డ్‌కు తగినట్లుగా విద్యావిధానంలో మార్పు రావాలి, అప్పుడే భవిష్యత్ ఉజ్వలం!

28 February 2022, 17:45 IST

google News
    • విద్యార్థులను వినూత్నంగా, కొత్త దృష్టికోణంతో ఆలోచించే విధంగా ప్రోత్సహించాలి. విద్యార్థుల అభిప్రాయాలు, ఆకాంక్షలను పరిగణాలోకి తీసుకుని వారి అభిరుచులకు తగ్గట్టుగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి.  
CBSE Students
CBSE Students

CBSE Students

మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ప్రస్తుతం విద్యా విధానంలో మార్పులు చాలా అవసరం. టెక్పాలజీ విస్తరిస్తున్న వేళ వాటికి అణుగుణంగా విద్యా ప్రమాణాలను మార్చాలి. ప్రాథమిక విద్య నుంచే టెక్నాలజీపై విద్వార్థులకు అవగాహన కల్పించాలి.  అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ, ఉన్నత విద్యపై నిరంతర పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మేటి విద్యార్థులను తయారుచేయవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాల్సిన అవసరం ఉంది. కొత్తగా కొన్ని గైడ్‌లైన్స్‌ను రూపొందించి విద్యా బోధన సాగాలి. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథమెటిక్స్‌ (స్టెమ్‌)లో ప్రయోగాల ఆధారిత విద్యా విధానం జరగాలి. 

ప్రపంచంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులను వినూత్నంగా, కొత్త దృష్టికోణంతో ఆలోచించే విధంగా ప్రోత్సహించాలి.  విద్యార్థుల అభిప్రాయాలు, ఆకాంక్షలను పరిగణాలోకి తీసుకుని వారి అభిరుచులకు తగ్గట్టుగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి. కృత్రిమ మేధ (Artificial intelligence), మిషన్‌ లెర్నింగ్‌ (Mission Learning ) లాంటి ఎక్కువ డిమాండ్‌ ఉన్న కోర్సులపై ద‌ృష్టి సారించాలి. ముఖ్యంగా ఉన్నతవిద్యలో ప్రాక్టికల్‌ ఆధారిత బోధన అత్యంత ఆవశ్యకం.

అంతర్జాతీయ విద్య విధానం స్టెమ్‌ విద్య సిద్ధాంత కేంద్రంగా కొనసాగుతోంది. కావున వీటిలో వినూత్న మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్‌ - సైబర్‌ఫిజికల్‌ సిస్టమ్‌, డేటాసైన్స్‌ - బిజినెస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ బయోలాజికల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ - ఏఐ లాంటి ఆదరణ ఉన్న కోర్సుల విస్తృతిని పెంచాలి.

కాలనుగుణంగా విద్యాబోర్డులు, వర్సిటీలు పాఠ్యప్రణాళికను ఆధునికీకరిస్తుండాలి. ముఖ్యంగా ప్రయోగాలతో కూడా విద్యను అందించాలి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటెర్న్‌షిప్‌ పోగ్రాం అందించాలి. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ నిర్వహణ ఉండాలి. అకాడమిక్ కోర్సులతో పాటు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్ పెంపోదించాలి. ఆటలు, వ్యాయమాలు ఇతర కార్యక్రమాలు తప్పనిసరి నిర్వహించాలి. ఉపాధ్యాయలకు కూడా నూతన మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇప్పించాలి. మెుత్తంగా విద్యావ్యవస్థలో నూతన అవిష్కరణలతో కూడా మార్పులు రావాలి.

తదుపరి వ్యాసం