తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mosquitoes: ఇంట్లోని దోమలను తరిమికొట్టేందుకు అరటి పండుతో ఇలా చేస్తే చాలు

Mosquitoes: ఇంట్లోని దోమలను తరిమికొట్టేందుకు అరటి పండుతో ఇలా చేస్తే చాలు

Haritha Chappa HT Telugu

07 November 2024, 16:30 IST

google News
  • Mosquitoes: దోమలను వదిలించుకోవడానికి, మనకు సురక్షితం కాని అన్ని రకాల రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తాము. ఈ రోజు మేము మీకు అరటిపండు సహాయంతో దోమలను తరిమికొట్టే చాలా అద్భుతమైన ట్రిక్ చెప్పబోతున్నాము.

అరటిపండుతో దోమలను తరిమికొట్టండి
అరటిపండుతో దోమలను తరిమికొట్టండి (Shutterstock)

అరటిపండుతో దోమలను తరిమికొట్టండి

దోమల బెడద రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతోంది. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను ఇవి వేగంగా వ్యాపించేలా చేస్తాయి. ప్రతి ఇంట్లోనూ దోమలు విపరీతంగా చేరిపోతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మనుషులను కుట్టేస్తున్నాయి. ఈ దోమల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దోమల నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో దోమలను తరిమే ఉత్పత్తులు పెరిగుతున్నాయి. కానీ వాటిని వాడడం వల్ల అనేక రసాయనాలు గాలిలో కలుస్తాయి. అవి మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం అరటిపండుతోనే దోమలను తరిమివేయవచ్చు.

అరటిపండ్ల సహాయంతో దోమలను ఎలా తరిమికొట్టాలో ఇక్కడ మేము చెప్పాము. ఇలా ఫాలో అయితే దోమలను ఇంట్లోంచి తరిమేయవచ్చు. దోమలను దూరంగా ఉంచడంలో అరటిపండు చాలా సహాయపడుతుంది. అదెలాగో తెలుసుకోండి.

అరటిపండు ఇలా వాడితే

దోమలను తరిమికొట్టడంలో అరటిపండు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం మీరు పెద్దగా కష్ట పడాల్సిన అవసరం కూడా లేదు. నిద్రపోవడానికి ఒక గంట ముందు అరటి తొక్కలను గదిలోని నాలుగు మూలల్లో ఉంచాలి. అరటి తొక్కల నుంచి వెలువడే వాసన దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే లేదా ఎవరికైనా శ్వాసకోశ సమస్యలు లేదా ఉబ్బసం ఉన్నవారు ఉంటే, మీరు రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా ఈ పద్దతిని ఒకసారి ప్రయత్నించవచ్చు.

ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా దోమల బెడద ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి దోమలను తరిమికొట్టడానికి అరటి తొక్క పేస్ట్ ను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం తొక్క తీసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దోమలు ఎక్కువగా ఉండే ఇంటి మూలల్లో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. దీని వాసన దోమలను చాలా వరకు తగ్గిస్తుంది. అరటి పండు నుంచి వచ్చే వాసన దోమలను సరిపడదు. ఎప్పుడైనా చూడండి.. అరటి పండ్లు ఉన్న చోట దోమలు కనిపించవు.

అరటి పండు తొక్కలను బయటపడేసే కన్నా… వాటిని ఉపయోగించడం వల్ల దోమలను బయటికి పంపించేయవచ్చు. అరటి తొక్కలను కాల్చడం ద్వారా కూడా దోమల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. నిజానికి అరటి తొక్కను కాల్చినప్పుడు దాని నుంచి వచ్చే వాసన చాలా వింతగా ఉంటుంది, దీని వల్ల దోమలు వీలైనంత త్వరగా పారిపోతాయి. కానీ అరటి తొక్కలను కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అరటి తొక్కను ఎండబెట్టి దాన్ని కాల్చండి. అలా కాసేపు ఆ పొగను గదిలోనే ఉండేలా చూసుకోండి. దాని నుంచి వచ్చే వాసనను దోమలకు నచ్చదు. ఈ వాసన మీకు ఎలాంటి సమస్యలను కలిగించదు. ఇది సేంద్రీయ విధానంలో దోమలను బయటికి పంపినట్టే.

దోమలు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ వచ్చిందంటే ది ప్రాణాంతకంగా మారిపోతుంది. కాబట్టి వీలైనంతగా దోమలను దూరంగా ఉంచడం మంచిది.

తదుపరి వ్యాసం