తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iqoo 10 Pro । కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్, 200w ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్!

iQoo 10 Pro । కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్, 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్!

HT Telugu Desk HT Telugu

20 July 2022, 20:32 IST

google News
    • స్మార్ట్‌ఫోన్ మేకర్ iQOO తాజాగా iQoo 10 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ప్రో మోడల్ లో ఏకంగా 200W ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
iQoo 10 series
iQoo 10 series

iQoo 10 series

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO తాజాగా iQoo 10, iQoo 10 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో iQoo 10 Pro అనేది 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. వేరే ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో ఇలాంటి సామర్థ్యం కలిగిన ఛార్జర్ లేదు. ఇప్పటివరకు వచ్చిన వాటిలో 120W హైఎస్ట్. ప్రో మోడల్ కోసం అందిస్తున్న 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 10 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ఇస్తున్నారు. ఖరీదైన ఫ్లాగ్ షిప్ ఫోన్లలో మాత్రమే ఇలాంటి ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా iQoo 10 Proలో మెరుగైన వీక్షణ కోసం Quad HD+ డిస్‌ప్లే ఇచ్చారు.

ఇంకా ఈ రెండు కొత్త ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

iQoo 10 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లే
  • 12 GB RAM, 512 GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1+ ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+50MP+ 14.6MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ఇంకా ఈ ఫోన్ లో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, VC సోకింగ్ ప్లేట్, స్టీరియో స్పీకర్లు, హై-ఫై ఆడియో, టైప్-సి ఆడియో ఉన్నాయి. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ధర 4,999 యువాన్. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 59,225/-

iQoo 10 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల FHD+ E5 AMOLED డిస్‌ప్లే
  • 12 GB RAM, 512 GB స్టోరేజ్ సామర్థ్యం
  • ఆక్టా-కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1+ ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+13MP+ 12MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

iQoo 10 ధర 3,699 యువాన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 43,825/-

ప్రస్తుతం ఈ ఫోన్లు చైనాలో విడుదలయ్యాయి. 10 జూలై 26 నుంచొ vivo స్టోర్లలో లభించనున్నాయి. అయితే ఇండియాలో ఎప్పుడనేది కన్ఫర్మ్ చేయలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం