తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infinix Smart 6 Hd | రూ. 7 వేల కంటే తక్కువ ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌!

Infinix Smart 6 HD | రూ. 7 వేల కంటే తక్కువ ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

10 August 2022, 15:34 IST

    • ఇన్ఫినిక్స్ తాజాగా మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది రూ. 7 వేల లోపు ధరలోనే అందుబాటులో ఉంటుంది. పైగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వివరాలు చూడండి.
Infinix Smart 6 HD
Infinix Smart 6 HD

Infinix Smart 6 HD

మొబైల్ తయారీదారు ఇన్ఫినిక్స్ ఈ ఏడాదిలో స్మార్ట్ 6, స్మార్ట్ 6 ప్లస్ అనే రెండు ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తర్వాత సిరీస్‌లో మూడవ ఫోన్ Infinix Smart 6 HD స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ఫోన్. మిగతా రెండింటి కంటే కూడా తక్కువ ధరతో విడుదలయింది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

భారతీయ మార్కెట్‌లో సరికొత్త Infinix Smart 6 HD స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 6,799/- గా ఉంది. ఈ ఫోన్ ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ , ఆక్వా స్కై అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 12 నుండి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ఏకైక సెన్సార్- LED ఫ్లాష్‌తో కూడిన సూడో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది. అయితే చూడటానికి మాత్రం ప్రీమియం ట్రిపుల్-కెమెరా సెటప్ వలె కనిపిస్తుంది. ఈ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ ఆధారంగా పనిచేస్తుంది.

ఇంకా Infinix Smart 6 HD లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ఇతర వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Infinix Smart 6 HD స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల TFT LCD డిస్‌ప్లే
  • 2GB RAM , 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో SD స్లాట్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు)
  • మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్
  • వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 5W ఛార్జింగ్‌ సపోర్ట్
  • ధర రూ. 6,799/-

మైక్రో-USB పోర్ట్, డ్యూయల్-సిమ్‌ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు ఒక స్పీకర్‌ను కలిగి ఉంది. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం