'దమ్ ఆలూ బెనారసీ' చూస్తేనే నోరూరుతుంది.. రెసిపీ ఇదిగో..!
28 February 2022, 19:04 IST
- 'బెనారసీ దమ్ ఆలూ' రెసిపీ చాలా సింపుల్, రుచి కూడా అదిరిపోతుంది. ఎర్రగా నోరురించే ఈ వంటకాన్ని చూసినా, రుచిచూసినా ఇంట్లో తయారు చేశారా? లేక ఏదైనా రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అనేంతలా దాసోహమవుతారు.
Dum Aloo Banarasi Recipe
బెండకాయ, దొండకాయ అంటూ రోజూ ఒకేరకమైన కూరలు తిని తిని విసిగిపోయారా? కొత్తగా ఏదైనా తినాలనుకున్నా, ఏం వండాలో తోచడం లేదా? అయితే ఇంట్లో ఉండే పదార్థాలతోనే సరికొత్తగా స్పెషల్ 'బెనారసి దమ్ ఆలూ' రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ వంటకం చేయడం చాలా సింపుల్, రుచి కూడా అదిరిపోతుంది. ఎర్రగా నోరురించే ఈ వంటకాన్ని చూసినా, రుచిచూసినా ఇంట్లో తయారు చేశారా? లేక ఏదైనా రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారా అనేంతగా దాసోహమవుతారు.
దమ్ ఆలూ బెనారసీకి కావలసిన పదార్థాలు
12 నుండి 15 బేబీ బంగాళాదుంపలు
2 కప్పులు టమాటాలు సుమారుగా తరిగినవి
3 వెల్లుల్లి రెమ్మలు.
చిన్న అల్లం ముక్క
8 కాశ్మీరి ఎండు మిరపకాయలు
2 టేబుల్ స్పూన్ల తురిమిన జీడిపప్పు
1 స్పూన్ జీలకర్ర
1 స్పూన్ ఫెన్నెల్ సీడ్స్
2 -3 కప్పుల నీరు మరియు
గ్రేవీకి, డీప్ ఫ్రైయింగ్ కోసం నూనె.
ఇతర పదార్థాలు
8 యాలకులు,
1 టేబుల్ స్పూన్ కసూరి మేతి
1 టేబుల్ స్పూన్ తేనె
1/4 కప్పు తాజా క్రీమ్
కొత్తిమీర
2 స్పూన్ వెన్న
రుచికి తగినంత ఉప్పు
తయారీ విధానం:
ముందుగా, బేబీ బంగాళాదుంపలను బాగా కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత ప్రతి బంగాళాదుంపపై ఫోర్క్ సహాయంతో గీరలు చేయాలి, పొట్టు తీయడం లేదని ఇక్కడ గమనించాల్సిన విషయం. అనంతరం వీటిని మరిగే నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత ఓ టిష్యూ పేపర్‌పై తీసుకొని పక్కన పెట్టండి.
ఇప్పుడు గ్రేవీ కోసం పైన మొదట పేర్కొన్న అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి వేసి, మీడియం మంట మీద టమోటాలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత, దానిని బ్లెండర్‌కి బదిలీ చేసి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో వెన్నని వేడి చేసి అందులో యాలకులు వేయించుకొని గ్రేవీ పేస్ట్ కలపాలి. అనంతరం మంటను పెంచి, నూనె బయటకు వచ్చే వరకు అలాగే ఉంచండి.
ఇప్పుడు వేయించిన బంగాళాదుంపలు, కసూరి మేతి, తేనె మరియు ఉప్పు బాగా కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే! కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇపుడు రుచికరమైన 'బెనారసీ దమ్ ఆలూ' సిద్ధం అయినట్లే. దీనిని రోటీతో గానీ, అన్నంతో గానీ తీసుకోవచ్చు.
టాపిక్