Optical Illusion: మీరు తెలివైన వారైతే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో జింక ఎక్కడుందో కనిపెట్టండి, ఏకాగ్రతతో చూస్తే దొరికిపోతుంది
01 November 2024, 12:30 IST
- Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మేము మీ ఏకాగ్రతకు పరీక్ష పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్‌ను అందించాము.
ఆప్టికల్ ఇల్యూషన్
మెదడుకు, మానసిక ఆరోగ్యానికి సవాలు విసిరేవి ఆప్టికల్ ఇల్ల్యూషన్లు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లు మీ తెలివితేటలను కూడా పరీక్షిస్తాయి. అలాగే మీ మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుంది, మీ కంటి చూపు ఎలా ఉంది, మీకు ఏకాగ్రత సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా ఈ ఆప్టికల్ ఇల్యుషన్లు తేల్చేస్తాయి. ఇక్కడ మేము ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఒక జంతువు దాక్కొని ఉంది. ఆ జంతువు జింక. ఆ జింక ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు, మేము మీకు ఇస్తున్న సమయం కేవలం 20 సెకన్లు. ఇరవై సెకన్లలో మీరు జింక ఎక్కడుందో కనిపిస్తే మీ ఏకాగ్రత స్థాయిలు ఎక్కువే అని ఒప్పుకోవాలి.
ప్రతి మనిషికి ఏకాగ్రత చాలా అవసరం. మీరు కూడా తెలివైన వారు, ఏకాగ్రత కలవారయితే ఆ జింకను ఇట్టే పట్టేస్తారు. జింకను కనిపెట్టిన వారికి ధన్యవాదాలు. కనిపెట్టనివారు ఒక క్లూ ఇస్తున్నాం. జింక కూడా ఆకుపచ్చని రంగులోనే చెట్లకు దగ్గరలో ఉంది. ఇంకా మీకు జవాబు అర్థం కాకపోతే కింద మేము ఫోటోలో జింక ఎక్కడ ఉందో రౌండప్ చేశాము, దాన్ని చూడండి.
ఆప్టికల్ ఇల్యూషన్ ఉపయోగాలు
ఏకాగ్రతకు సవాల్ విసిరే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు చేధిస్తూ ఉండాలి. ఇది మీకు మీ సామర్థ్యం ఏంటో మీకు తెలిసేలా చేస్తుంది. మీ మెదడు ఎలా పనిచేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఏ విషయంలో వెనుకబడి ఉన్నారో, ఏ విషయంలో ప్రాక్టీస్ చేయాలో తెలుస్తుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎక్కడ కనబడినా కూడా వదలకుండా ప్రయత్నించండి. ఇవి మీకు అన్ని రకాలుగా మేలే చేస్తాయి. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దిశగా మెదడు ఆలోచనలు చేయడానికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ఉపయోగపడతాయి. ఇవి మీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సామర్ధ్యాన్ని పెంచుతాయి. మీ కళ్ళకు, మెదడుకు సవాలు విసిరే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు మీలో ఏకాగ్రతను, తెలివితేటలను పెరగడానికి సహాయపడతాయి.
మనం చూస్తున్న సమాచారాన్ని కళ్ళు... మెదడుకు చేరవేస్తే, మెదడు ఆ సమాచారాన్ని విశదీకరిస్తుంది. ఆ తర్వాత అది జవాబును కనిపెట్టి నోటి ద్వారా చెప్పిస్తుంది. కాబట్టి మెదడు, కళ్ళు అన్ని సమన్వయంగా పనిచేస్తేనే మనం మానసికంగా, శారీరకంగా సరైన నిర్ణయాలు తీసుకోగలము. దీన్ని బట్టి ఆప్టికల్ ఇల్యూషన్లను సాధించడం ఎంత ఉపయోగమో మీకే అర్థమవుతుంది. మీ మెదడుకు పదును పెట్టాలంటే ఆప్టికల్ ఇల్యూషన్లను, బ్రెయిన్ టీజర్లను సాధిస్తూనే ఉండాలి. ఇవి మీకు అన్ని రకాలుగా మేలే చేస్తాయి. ఇప్పుడు ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కేవలం ఈ ఆప్టికల్ ఇల్యూషన్లపై కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజీలు కూడా ఉన్నాయి.
విదేశాల్లో ప్రత్యేకంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రకారులు కూడా ఉన్నారు. వీరి వృత్తి ఆప్టికల్ ఇల్యూషన్లను సృష్టించడమే. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ అయ్యేలా చేసి సంపాదిస్తున్నారు. ఇది ఈనాటివి అనుకుంటే పొరపాటే, వేలఏళ్ల నాటి నుంచే ఆప్టికల్ ఇల్యూషన్లు ఉండేవని చెప్పే ఆధారాలు కొన్ని దొరికాయి. ప్రస్తుతం దొరికిన ఆధారాల ప్రకారం ఆప్టికల్ ఇల్యుషన్లు గ్రీకు దేశంలో పుట్టాయని అంటారు. ఎందుకంటే అక్కడి పురాతన దేవాలయాలపై కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూషన్లను చరిత్రకారులు గుర్తించారు.
టాపిక్