తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Badam Skincare: బాదంపప్పులు ఇలా వాడారంటే ముఖంలో కాంతి వస్తుంది, ఇందుకు ఒక్క బాదంగింజ చాలు

Badam Skincare: బాదంపప్పులు ఇలా వాడారంటే ముఖంలో కాంతి వస్తుంది, ఇందుకు ఒక్క బాదంగింజ చాలు

Haritha Chappa HT Telugu

16 September 2024, 8:00 IST

google News
  • Badam Skincare: బాదం ఆయిల్ వాడడం వల్ల డ్రై స్కిన్ వారికీ ఎంతో ఉపయోగం ఉంటుంది.  కేవలం ఒక బాదం పప్పు సాయంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఒక బాగం గింజతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.

బాదం పప్పుతో ఫేస్ ప్యాక్
బాదం పప్పుతో ఫేస్ ప్యాక్ (shutterstock)

బాదం పప్పుతో ఫేస్ ప్యాక్

బాదం పప్పులో మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల అనేక రకాల సూక్ష్మపోషకాలు లభిస్తాయి. బాదంపప్పులను తినడం వల్లే కాదు, దాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మంపై ఎంతో మంచి ప్రభావం ఉంటుంది. అలాగని బాదం నూనెను ముఖానికి మసాజ్ చేయడం మంచిది. అయితే బాదం నూనె, బాదం పప్పులను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కేవలం ఒక బాదం గింజతో కూడా ఫేస్ ప్యాక్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది ముఖంపై మెరుపును ఇస్తుంది, అలాగే చర్మంపై కనిపించే సన్నని గీతలు, ముడతలను తొలగిస్తుంది.

బాదం పప్పులు తినడం వల్ల, ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేయడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేయవచ్చు. ఇది చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. జిడ్డు చర్మం, పొడి చర్మం… రెండింటి పైనా బాదం ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

జిడ్డు చర్మంగలవారికి

మీకు జిడ్డు చర్మం ఉన్నప్పటికీ, బాదం నూనెతో చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ఒకటి లేదా రెండు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ బాదంను ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. పెరుగులో బాదం పేస్ట్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. అలా ఓ పావుగంట పాటు రోజువదిలేయాలి. తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేస్‌ప్యాక్‌తో ఉపయోగాలు

జిడ్డు చర్మంపై మొటిమలు త్వరగా వస్తాయి. వాటిని పొగొట్టుకోవడానికి బాదం ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖం వాడిపోయినట్టు కనిపిస్తున్నా కూడా వెంటనే ఫేస్ ప్యాక్ వేసుకోండి. బాదం పప్పు పేస్టును పెరుగుతో కలిపి అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోవడమే కాకుండా జిడ్డుగా కనిపించే ముఖం తాజాగా కనిపిస్తుంది.

పొడి చర్మం ఉన్న వారికి

పొడి చర్మం ఉన్నవారికి త్వరగా ముఖంపై ముడతలు, సన్నని గీతలు వస్తాయి. అలాంటప్పుడు బాదం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా మారుతుం సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీకి నానబెట్టిన బాదం పప్పులను ఓట్స్, పాలలో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. తేలికపాటి చేతులతో మసాజ్ చేసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ ను తొలగించి చర్మానికి నేచురల్ తేమను ఇస్తుంది.

బాదంపప్పుల్లో మన చర్మానికి అత్యవసరమైన విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని మెరిపిస్తాయి కూడా. బాదంపప్పులను నానబెట్టి తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.  రోజుకు మూడు నాలుగు నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గించుకోవచ్చు. బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ మెదడుకు రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. బాదం, వాల్ నట్స్ తినేవారికి మెదడు సమస్యలు తక్కువగా వస్తాయి.

 

 

తదుపరి వ్యాసం