Indian Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు!
18 July 2022, 21:14 IST
- ICF Recruitment 2022: రైల్వే శాఖ 876 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్‌తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపింది.
Integral Coach Factory ICF Recruitment 2022:
Integral Coach Factory ICF Recruitment 2022: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్ ఉన్నవారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పి్ంది. రైల్వేకు చెందిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో 876 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పది అర్హత కలిగి ఉండి.. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఇది మంచి అవకాశం. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), చెన్నై అధికారిక వెబ్‌సైట్ - pb.icf.gov.in లో రిక్రూట్‌మెంట్ సంబంధించిన వివరాలను ఉంచింది. ICF అప్రెంటీస్ పోస్టులకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 26 జూలై 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అప్రెంటిస్ పోస్టుల వివరాలు
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రైల్వే 876 అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ - మొత్తం 276 పోస్ట్‌లు
కార్పెంటర్: 37 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 32 పోస్టులు
ఫిట్టర్: 65 పోస్టులు
మెషినిస్ట్: 34 పోస్టులు
పెయింటర్: 33 పోస్టులు
వెల్డర్: 75 పోస్టులు
పసా: 02 పోస్టులు
Ex ITI అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ - మొత్తం 600 పోస్ట్‌లు
కార్పెంటర్: 50 పోస్టులు
ఎలక్ట్రీషియన్: 156 పోస్టులు
ఫిట్టర్: 143 పోస్టులు
మెషినిస్ట్: 29 పోస్టులు
పెయింటర్: 50 పోస్టులు
వెల్డర్: 170 పోస్టులు
పసా: 02 పోస్టులు
విద్యార్హతలు: అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు
వయో పరిమితి: అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాలు ఉండాలి. OBC కేటగిరీలకు 3 సంవత్సరాలు, SC/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది. EWS, ESM, PwD వంటి ఇతర వర్గాలు కూడా నిబంధనల ప్రకారం వయో సడలింపు పొందవచ్చు. అభ్యర్థి వయస్సు 26.07.2022 వరకు లెక్కించబడుతుంది.
దరఖాస్తు రుసుము
జనరల్ మరియు OBC కేటగిరీ అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా రూ. 100 చెల్లించాలి.SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును మినహాయింపు లేదు. దయచేసి గమనించండి, ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత, దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pb.icf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో 26 జూలై 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ICF Recruitment 2022:: ఎలా దరఖాస్తు చేయాలి
Step 1- ముందుగా pb.icf.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2- కెరీర్ పేజీలో ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3- అవసరమైన అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
Step4- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి- ఫోటో, సైన్, ఐడి ప్రూఫ్ మొదలైనవి.
Step 5- ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
Step 6- భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
టాపిక్