తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indian Railways : 'స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్‌'.. మీ ఐడియా నచ్చితే ఫస్ట్ కోటి 50 లక్షలు

Indian Railways : 'స్టార్టప్స్‌ ఫర్‌ రైల్వేస్‌'.. మీ ఐడియా నచ్చితే ఫస్ట్ కోటి 50 లక్షలు

HT Telugu Desk HT Telugu

16 June 2022, 15:45 IST

    • రైల్వేల వృద్ధికి సహకరించేందుకు 'స్టార్టప్‌ ఫర్‌ రైల్వేస్‌' యువ పారిశ్రామిక వేత్తలకు సువర్ణావకాశం. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై వాల్తేర్ రైల్వే డివిజన్ మేనేజర్ అనూప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసక్తిగలవారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఇటీవలే కేంద్రం స్టార్టప్ ఫర్ రైల్వేస్ తో ముందుకొచ్చింది. యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని వాల్తేర్ డ డీఆర్ఎం అనూప్ అన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

భారతదేశంలోని యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి చేర్చడం లక్ష్యంగా కొత్త విధానం ఉపయోగపడుతుందని డీఆర్ఎం అన్నారు. వాల్తేర్ డివిజన్‌ పరిధిలో రైల్వేకు అవసరమైన సాంకేతిక ఆవిష్కరణలు అందించేందుకు స్టార్టప్స్‌కు, యువతకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు.

రైల్వేకు సమస్యాత్మకంగా మారిన 100 అంశాలలో తొలివిడతగా గుర్తించిన 11 అంశాలకు సంబంధించి పరిష్కారాలను చూపేలా సాంకేతిక ఆవిష్కరణలు చేసే స్టార్ట్‌పలను ప్రోత్సహించనున్నారు. అంకుర సంస్థల ఐడియాలకు ఆచరణ రూపం కల్పించేందుకు రైల్వే ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. ఈ అవకాశాన్ని స్టార్ట్‌ప్స్, వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. వాల్తేర్ డీఆర్ఎం స్టార్టప్స్ ఫర్ రైల్వేస్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

సమస్యలపై తమ ఐడియాలతో స్టార్టప్స్ మందుకు వస్తే.. పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేస్తామని డీఆర్ఎం అనూప్ అన్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు రైల్వే మొదటి విడతగా రూ.1.50 కోట్లు, ట్రయల్స్‌ పూర్తయిన తర్వాత రూ. 3 కోట్ల మేర ఖర్చు చేస్తామన్నారు. ఆ తర్వాత.. ఆ టెక్నాలజీని రైల్వే ఉపయోగించుకుంటుందన్నారు. అయితే ఈ ఆవిష్కరణలకు అంకుర సంస్థలే టైటిల్‌ దారులుగా ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 21 నుంచి అప్లై చేయోచ్చు. ఆ తేదీ నుంచి https://www.innovation.indianrailways.gov.in సైట్‌కు లాగిన్‌ అయి.. సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. ఆవిష్కరణలు, ఐడియాలను అప్‌లోడ్‌ చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం