Eight Hugs: ఇష్టమైన వారిని రోజుకి ఎనిమిది సార్లు కౌగిలించుకోండి, అలా చేస్తే మీలో వచ్చే మార్పులు ఇవే
07 October 2024, 18:00 IST
- Eight Hugs: ప్రతి మనిషికి ఇష్టమైన వారు ఎవరో ఒకరు ఉంటారు. మీ ఇంట్లో వారు మీకు ఇష్టమైన వారి జాబితాలోనే ఉంటారు. వారిని ప్రతిరోజూ కనీసం ఎనిమిది సార్లు కౌగిలించుకోండి. మీ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి.
కౌగిలింతలతో మానసిక ఆరోగ్యం
Eight Hugs: కౌగిలింత అనేది కేవలం శారీరక సంబంధాన్ని మాత్రమే సూచించేది కాదు. అది ఒక అద్భుతమైన శక్తి కలది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడేది. భావోద్వేగ శ్రేయస్సుకు ఒత్తిడి తగ్గించడానికి కౌగిలింత ఎంతో ఉపయోగపడుతుంది. మీ తల్లిదండ్రులలైనా, మీ పిల్లలనైనా... మీకు ఇష్టమైన వారిని ఎవరినైనా రోజులో కనీసం ఎనిమిది సార్లు కౌగిలించుకోవడం అలవాటు చేసుకోండి. ఎనిమిది నుంచి మెల్లగా 12సార్లు కౌగిలించుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి.
లవ్ హార్మోన్ ఉత్పత్తి
కౌగిలింత అనేది ఆప్యాయతకు చిహ్నం. కేవలం ప్రేమ, ఆప్యాయత చూపించడానికి హగ్ ఇవ్వాలని అనుకోకండి. మీ ఆరోగ్యం కోసం మీకు ఇష్టమైన వారి శ్రేయస్సు కోసం కూడా మీరు రోజూ కౌగిలించుకుంటూ ఉండాలి. హగ్గింగ్ అనేది ఆక్సిటోసిన్ విడుదల చేస్తుంది. దీనివల్ల భావోద్వేగాల్లో స్థిరత్వం, ఒత్తిడి తగ్గడం వంటి మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఆక్సిటోసిన్‌ను అనేది లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు.
సంతోషంగా ఆరోజు జీవించడం కోసం మీకు ఇష్టమైన వారికి నాలుగు హగ్గులు ఇవ్వండి. వారు, మీరు చక్కగా పనులు చేసుకోవడం కోసం మరో నాలుగు హగ్గులు ఇవ్వండి. అలాగే వారు చదువులో లేదా ఉద్యోగంలో రాణించేందుకు మరొక నాలుగు హగ్గులు ఇవ్వండి. ఇలా ఎనిమిది నుంచి 12 హగ్గులు ప్రతిరోజు ఇస్తే మీ భావోద్వేగా ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మీతో పాటూ మీకు ఇష్టమైన వారు కూడా చురుగ్గా, సంతోషంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. కౌగిలించుకోవడం వల్ల ఉండే లాభాలు అన్నీఇన్నీ కావు.
ఎంతసేపు కౌగిలించుకోవాలి?
హగ్గింగ్ అనగానే ఇలా కౌగిలించుకొని అలా వదిలేయడం కాదు. కనీసం 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు మీకు ఇష్టమైన వారిని కౌగిలించుకొని అలా ఉండండి. ఆ సమయంలోనే ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపించడం జరుగుతుంది. మీకు విశ్రాంతిగా అనిపిస్తుంది. ఎదుటివారితో మీరు మరింత కంఫర్ట్‌గా ఆనందంగా జీవిస్తారు.
కౌగిలింతలు ఎవరికి అవసరం?
నిజానికి ప్రేమ, ఆప్యాయతను పంచే కౌగిలింత అందరికీ అవసర.మే అయితే ముఖ్యంగా శిశువులు, ఎదుగుతున్న పిల్లలు, వృద్దులకు... కౌగిలింత చాలా ముఖ్యమైనది. ఇది ఇచ్చే భౌతిక స్పర్శ నుంచి వారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. శిశువులను కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగాలు, శారీరక వికాసం వారిలో ఉంటాయి. పిల్లలకు ప్రేమ, భద్రత కూడా కౌగిలింతలు అందిస్తాయి. ఇక వృద్ధులను కౌగిలించుకుంటే ఒంటరితనం, డిప్రెషన్ వంటివి వారిలో రాకుండా ఉంటాయి.
ఇద్దరు ప్రేమికులు లేదా భార్యాభర్తలు కౌగిలించుకుంటే వారికి ఒకరిపై ఒక ఉన్న ప్రేమ పెరుగుతుంది. వారిలో మరింత అర్థం చేసుకునే గుణం రెట్టింపు అవుతుంది. వారి సాన్నిహిత్యం వారి బంధాన్ని బలంగా మారుస్తుంది. భౌతికమైన స్పర్శ అనేది ఎదుటివారితో మీలో సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే బయటి వారి పర్మిషన్ లేకుండా హగ్ చేసుకోవద్దు.
టాపిక్