తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Schezwan, Tomato Sauce: షెజ్వాన్ సాస్, టమాటా సాస్ ఇంట్లోనే ఇలా చేసేయండి, నెలపాటూ నిల్వ ఉంటాయి

Schezwan, tomato sauce: షెజ్వాన్ సాస్, టమాటా సాస్ ఇంట్లోనే ఇలా చేసేయండి, నెలపాటూ నిల్వ ఉంటాయి

30 June 2024, 15:29 IST

google News
  • Schezwan, tomato sauce: పిల్లలు ఇష్టపడే షెజ్వాన్ సాస్, టమాటా సాస్ ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా, బయట దొరికే వాటిలా రుచి రావాలంటే పక్కా కొలతలతో తయారు చేయాల్సిందే. అదెలాగో చూసేయండి.

టమాటా సాస్, షెజ్వాన్ సాస్
టమాటా సాస్, షెజ్వాన్ సాస్ (freepik)

టమాటా సాస్, షెజ్వాన్ సాస్

షెజ్వాన్ సాస్, టమాటా సాస్‌ను.. పిల్లలు, పిద్దలు అందరూ ఇష్టపడతారు. ఏ స్నాక్స్ అయినా ఈ సాస్‌లతో తినడానికి ఇష్టపడతారు. కొంతమంది దోశల్లోకి కూడా షెజ్వాన్ సాస్ వాడతారు. వీటితో నూడుల్స్, ఫ్రైడ్ రైస్, బర్గర్లు, శ్యాండ్‌విచ్.. ఇలా చాలానే చేసుకుని తింటారు. అయితే ప్రతిసారీ వీటిని బయటనుంచి తెచ్చుకుంటాం. కానీ ఇంట్లోనే కాస్త ఓపికుంటే ఈ రెండు సాస్‌లనూ తయారు చేసుకోవచ్చు. వాటికోసం కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి.

షెజ్వాన్ సాస్ కోసం కావాల్సిన పదార్థాలు:

30 ఎండుమిర్చి

20 వెల్లుల్లి రెబ్బలు

4 చెంచాల అల్లం తురుము

3 చెంచాల టమాటా సాస్

1 చెంచా సోయాసాస్

1 టీస్పూన్ మిరియాల పొడి

2 చెంచాల పంచదార

పావు కప్పు నూనె

4 చెంచాల వెనిగర్

షెజ్వాన్ సాస్ తయారీ విధానం:

1. ముందుగా ఎండుమిర్చి తొడిమెలను తీసేసి అందులో ఉన్న గింజలు బయటకు తీసేయాలి.

2. ఇప్పుడు ఒక కడాయిలో ఈ ఎండుమిర్చి, కప్పు నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి. కనీసం 5 నిమిషాలు మగ్గించుకోవాలి. దాంతో ఎండుమిర్చి బాగా ఉబ్బి మెత్తగా అవుతాయి. వాటిని నీళ్లతో నుంచి తేసేయాలి.

3. మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ఉడకబెట్టుకున్న ఎండుమిర్చి, ఎండుమిర్చి ఉడికించుకున్న నీళ్లు కొద్దిగా వేసుకుని మెత్తటి ముద్దలా పట్టుకోవాలి.

4. ఇప్పుడు కాస్త వెడల్పాటి పాత్ర పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక అందులో అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. రెండు నిమిషాల పాటూ వేయించుకోవాలి.

5. అవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి ముద్ద వేసుకోవాలి. టమాటా సాస్, సోయా సాస్, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసుకుని కలపాలి.

6. వీటన్నింటిని కనీసం అయిదు నిమిషాలు పాటూ బాగా మగ్గనివ్వాలి. కాసేపటికి నీళ్లంతా ఇంకిపోయి కాస్త చిక్కగా తయారవుతుంది. అంతే.. షెజ్వాన్ సాస్ రెడీ అయినట్లే.

టమాటా సాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ పండిన టమాటాలు

సగం చెంచా కారం

3 చెంచాల పంచదార

రుచికి సరిపడా ఉప్పు

3 చెంచాల వెనిగర్

టమాటా సాస్ తయారీ విధానం:

1. ముందుగా ఒక పాత్రలో టమాటాలు వేసుకుని నీళ్లు పోసుకోవాలి. రెండు నిమిషాలు మగ్గించాక వాటి తొక్క తీసేయాలి.

2. వాటిని నీళ్లలో నుంచి తీసేసి చల్లార బెట్టుకోవాలి. చల్లారిన టమాటాలను మిక్సీ జార్‌లో వేసుకోవాలి.

3. నీళ్లు కలపకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

4. ఇప్పుడు ఒక జాలీ సాయంతో టమాటా ముద్దను వడకట్టాలి. అందులో ఉండే గింజలు వేరు అయిపోతాయి.

5. ఇప్పుడు అడుగు మందం ఉన్న కడాయిలో ఈ టమాటా ముద్ద వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. నీళ్లు దాదాపు ఇంకిపోయినపుడు కారం, పంచదార, ఉప్పు వేసుకొని మరోసారి కలియబెట్టాలి.

5. ఇప్పుడు నీళ్లు మొత్తం ఇంకిపోయి చిక్కగా తయారవుతుంది. అందులో వెనిగర్ వేసి కలుపుకోవాలి. దీనివల్ల సాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

6. అంతే.. టమాటా సాస్ చల్లారాక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే చాలు. ఇంట్లోనే టమాటా సాస్ రెడీ అయినట్లే.

 

తదుపరి వ్యాసం