తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Tikki Recipe : క్రంచీ క్రంచీ స్వీట్ కార్న్ టిక్కిని ఇలా చేసేయండి..

Corn Tikki Recipe : క్రంచీ క్రంచీ స్వీట్ కార్న్ టిక్కిని ఇలా చేసేయండి..

03 November 2022, 15:02 IST

    • Corn Tikki Recipe : చలికాలంలో సాయంత్రం తొందరగా వచ్చేస్తుంది. ఓ పక్క చలి వేస్తుంటే మనసు ఏమైనా క్రంచీగా, టేస్టీగా తినాలని కోరుకుటుంది. ఆ సమయంలో మీ టీకి తోడుగా ఓ మంచి స్నాక్ ఉంటే అదిరిపోతుంది కదా. అయితే మీరు కార్న్ టిక్కీని ట్రై చేయాల్సిందే.
స్వీట్ కార్న్ టిక్కి
స్వీట్ కార్న్ టిక్కి

స్వీట్ కార్న్ టిక్కి

Corn Tikki Recipe : ఏమైనా స్నాక్ తినాలనిపించినా.. గంటలు గంటలు కిచెన్​లో ఉండాల్సి వస్తుందని ఆలోచిస్తాము. పోని ఆర్డర్ చేద్దామా అంటే.. ధరలు అంతా ఇంతా ఉండవు. అయితే సింపుల్​గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే స్నాక్ ఒకటి ఉంది. అదే కార్న్ టిక్కీ. దీనిని తయారుచేయడం చాలా సింపుల్. పైగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

కావాల్సిన పదర్థాలు

* స్వీట్ కార్న్ - 1 కప్పు (ఉడికించినవి)

* బంగాళదుంపలు - 2 మీడియం (ఉడికించినవి)

* బ్రెడ్ క్రంబ్స్ - అరకప్పు

* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)

* అల్లం - 1/4 టీస్పూన్ (తురిమినది)

* వెల్లుల్లి రెబ్బలు - 4-5 ముక్కలుగా చేసుకోవాలి

* కొత్తిమీర - 4 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)

* గరం మసాలా - 1/4 టీస్పూన్

* నిమ్మరసం - 2 టీస్పూన్లు

* ఉప్పు - తగినంత

* కారం - 1 స్పూన్

* నూనె - తగినంత

తయారీ విధానం

ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో స్వీట్ కార్న్, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. దానిలో ఉడికించి బంగాళ దుంపలు వేసి బాగా కలపండి. దానిని టిక్కీలాగా వత్తుకుని.. బ్రెడ్ క్రంబ్స్ అద్దండి. వాటి డీప్ ఫ్రై చేస్తే.. కార్న్ టిక్కీ రెడీ. మీ చల్లని సాయంత్రానికి.. ఇది బెస్ట్ కంపెనీ ఇస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం