తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beans Poriyal Recipe : టేస్టీ టేస్టీ బీన్స్ పోరియల్.. ఇది చాలా హెల్తీ గురు..

Beans Poriyal Recipe : టేస్టీ టేస్టీ బీన్స్ పోరియల్.. ఇది చాలా హెల్తీ గురు..

03 November 2022, 6:38 IST

    • Beans Poriyal Recipe : ఉదయాన్నే హెల్తీగా తినాలనుకునేవారికి.. బీన్స్​ని తమ డైట్​లో భాగం చేసుకోవాలనుకునే వారికి ఈ బీన్స్ పోరియల్ ఓ చక్కటి వరం. ఇది టేస్ట్ ఇవ్వడమే కాదు. హెల్తీ కూడా. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
బీన్స్ పోరియల్
బీన్స్ పోరియల్

బీన్స్ పోరియల్

Beans Poriyal Recipe : బీన్స్ పోరియల్ అనేది ఓ హెల్తీ వంటకం. దీనిని మీ బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు.. లంచ్, స్నాక్, డిన్నర్​లా కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు, ఫిట్​నెస్​కి ప్రాధన్యత ఇచ్చేవారు తమ డైట్​లో దీనిని కచ్చితంగా కలిపి తీసుకోవచ్చు. ఇవి మీ కడుపును ఫుల్​గా ఉంచి.. ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. ఏ సమయంలో తీసుకున్న.. దీని బెనిఫిట్స్ మనకు అందుతాయి. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

కావాల్సిన పదార్థాలు

* బీన్స్ - 250 గ్రాములు

* నూనె - 2 టేబుల్ స్పూన్స్

* ఆవాలు - కొంచెం

* మినపప్పు - కొంచెం

* ఎండు మిర్చి - 2

* పసుపు - పావు టీస్పూన్

* ఇంగువ - చిటికెడు

* కరివేపాకు - 10

* తురిమిన కొబ్బరి - 3 టేబుల్ స్పూన్స్

* ఉప్పు - తగినంత

తయారీ విధానం

ముందుగా కడాయి తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో ఆవాలు, మినపప్పు వేసి వేయించండి. అవి చిలకరించిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా కలపండి. దానిలో తరిగిన బీన్స్ వేయండి. వాటిని బాగా కలపి వేయించండి. కొబ్బరి, ఉప్పు వేసి ఉడికించండి. బీన్స్ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. మీ ఉదయాన్ని మరింత హెల్తీగా మార్చే హెల్తీ బీన్స్ రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం