తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Salad Recipe : టేస్టీ టేస్టీ కార్న్ సలాడ్.. ఇలా సింపుల్​గా చేసేయండి..

Corn Salad Recipe : టేస్టీ టేస్టీ కార్న్ సలాడ్.. ఇలా సింపుల్​గా చేసేయండి..

02 November 2022, 6:49 IST

    • Corn Salad Recipe : మొక్కజొన్నలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. కానీ దీనిని మరింత హెల్తీగా ఎలా తీసుకోవాలో అందరికీ తెలియకపోవచ్చు. మరి దీనిని మరింత టేస్టీగా, హెల్తీగా, సింపుల్​గా ఎలా మన డైట్​లో భాగం చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
కార్న్ సలాడ్
కార్న్ సలాడ్

కార్న్ సలాడ్

Corn Salad Recipe : మన డేని హెల్తీగా స్టార్ట్ చేయాలంటే పర్​ఫెక్ట్ బ్రేక్​ఫాస్ట్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ బ్రేక్​ఫాస్ట్​గా మాత్రమే కాదు.. లంచ్, డిన్నర్, స్నాక్​లాగా కూడా తీసుకోవచ్చు. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. మరి కార్న్ సలాడ్​ని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కార్న్ సలాడ్ కోసం కావాల్సిన పదార్థాలు

* మొక్కజొన్న - 2 కప్పులు (ఉడకబెట్టినవి)

* బంగాళా దుంపలు - అర కప్పు (ఉడకబెట్టినవి)

* సేవ్ - పావు కప్పు

* ఉల్లిపాయలు - అరకప్పు

* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్ (సన్నగా తురిమినది)

* నిమ్మరసం - రుచికి తగినంత

* చట్నీ - 2 టేబుల్ స్పూన్స్

చట్నీ తయారీకి కావాల్సి పదార్థాలు

* కొత్తిమీర - 1 కప్పు

* మిర్చి - 1 టేబుల్ స్పూన్ (కట్ చేసినవి)

* వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (తరిగినవి)

* పంచదార - 2 టీస్పూన్

* ఉప్పు - 1 టీస్పూన్

* పెప్పర్ - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు మొక్కజొన్న, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కొత్తిమీర, నిమ్మరసం, చట్నీ వేసి బాగా కలపాలి. దానిని సేవ్, కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. ఇది ఏ మీల్​గా తీసుకున్నా.. మీకు చక్కని టేస్టీ, హెల్తీ బౌల్ అవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం