తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crispy Moong Dal: ప్యాకెట్లలో దొరికే క్రిస్పీ మూంగ్ ‌దాల్.. ఇంట్లోనే చేసేయండిలా

Crispy Moong Dal: ప్యాకెట్లలో దొరికే క్రిస్పీ మూంగ్ ‌దాల్.. ఇంట్లోనే చేసేయండిలా

17 October 2024, 15:30 IST

google News
  • Crispy Moong Dal: బయట ప్యాకెట్లలో దొరికే క్రిస్పీ మూంగ్ దాల్ ఇంట్లోనే తయారు చేయొచ్చు. కప్పు పప్పు వాడి చేశారంటే డబ్బానిండా టేస్టీ స్నాక్ రెడీ అవుతుంది. దాని తయారీ ఎలాగో చూసేయండి.

క్రిస్పీ మూంగ్ దాల్
క్రిస్పీ మూంగ్ దాల్

క్రిస్పీ మూంగ్ దాల్

మనం చిన్నప్పటి నుంచి తింటున్న స్నాక్స్‌లో క్రిస్పీ మూంగ్ దాల్ కూడా ఒకటి. అయితే బయట దొరికే ప్యాక్డ్ ఆహారంగా మాత్రమే దీన్ని తింటుంటాం. అసలు ఇంట్లో ఎలా చేస్తారని కూడా ఆలోచించం. కాస్త ఓపిక తెచ్చుకున్నారంటే డబ్బా నిండా మూంగ్ దాల్ మీరే చేసేయొచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.

క్రిస్పీ మూంగ్ దాల్ తయారీకి కావాల్సినవి:

కప్పున్నర పెసరపప్పు

సగం చెంచాడు కారం

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

అర టీస్పూన్ చాట్ మసాలా

అర టీస్పూన్ ఉప్పు

క్రిస్పీ మూంగ్ దాల్ తయారీ విధానం:

  1. ముందుగా పెసరపప్పును బాగా కడిగేసి నీటిలో కనీసం నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి.
  2. తర్వాత పప్పులో నీళ్లన్నీ వంపేసుకుని పక్కన పెట్టుకోండి.
  3. ఒక కాటన్ వస్త్రం తీసుకుని దానిమీద ఈ పప్పు వేసి ఓ గంటపాటు ఆరనివ్వండి. దీంతో తడి ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది.
  4. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక అందులో పప్పు వేసుకుని కొద్దికొద్దిగా ఫ్రై చేసుకోండి.
  5. కాస్త బంగారు వర్ణంలోకి మారి క్రిస్పీగా అయిపోగానే పప్పును తీసి ఒక పేపర్ టవెల్ మీద వేసుకోండి.
  6. నూనె ఎక్కువగా అనిపిస్తే పేపర్ టవెల్ లేదా టిష్యూతో కాస్త తుడిచినట్లు చేస్తే నూనె తగ్గిపోతుంది.
  7. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు మీద కారం పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  8. అన్నీ కలిపి కాస్త చల్లారాక డబ్బలో వేసుకుంటే చాలు. మీకిష్టమైన క్రిస్పీ మూంగ్ దాల్ రెడీ అయినట్లే.

టాపిక్

తదుపరి వ్యాసం