Coriander Seeds: ధనియాలతో ఇలా సులువుగా బరువు తగ్గొచ్చు, ధనియాలు ఎలా మేలు చేస్తాయో తెలుసుకోండి
24 February 2024, 16:30 IST
- Coriander Seeds: బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ధనియాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ధనియాలను వినియోగించడం ద్వారా త్వరగా బరువు తగ్గొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాల టీ
Coriander Seeds: అధిక బరువుతో బాధపడుతున్న వారు వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ధనియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ ధనియాలలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తూనే బరువును తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా ధనియాలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. దీనివల్ల మీరు ఆహారం తక్కువగా తింటారు. అది కూడా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలనిపిస్తుంది. తద్వారా బరువు తగ్గడం సులువుగా మారుతుంది.
ఆయుర్వేదం ప్రకారం మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. శక్తి స్థాయిలను పెంచడానికి దోహదపడతాయి. మొత్తంగా జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ధనియాలతో చేసిన ఆహారాన్ని తిన్నాక ఎక్కువ కాలం పాటు ఆకలి వేయదు. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది.
విష వ్యర్థాలు, సూక్ష్మ రూపంలో మెటల్స్ చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించే శక్తి ధనియాలకు ఉంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని కాపాడుతుంది. కడుపు ఉబ్బరం, పొట్ట తిమ్మిరి వచ్చినప్పుడు ధనియాలు తినేందుకు ప్రయత్నించండి. అయితే ధనియాలను ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలో తెలుసుకోండి.
ధనియాల టీ
దీన్ని హెర్బల్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఈ ధనియాల టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కోసం రెండు కప్పుల నీటిని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అలా మరుగుతున్న నీటిలో ధనియాలను వేయాలి. నీరు రంగు మారేవరకు చిన్న మంట మీద మరిగించాలి. దీన్ని వడకట్టి కాస్త తేనె కలుపుకొని తాగేయాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
బరువు తగ్గడానికి మరొక పానీయం ఉంది. అదే ధనియాలు, పుదీనా, నిమ్మకాయ కలిపిన పానీయం. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, ఉప్పు కలపండి. అందులోనే ధనియాలు, పుదీనా ఆకులను వేసి నానబెట్టండి. రెండు మూడు గంటలు నానబెట్టాక వడకట్టుకొని ఉదయం లేచాక ఖాళీ పొట్టతో ఈ పానీయాన్ని తాగేయండి. వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పానీయాన్ని తాగితే మంచిది.
ధనియాల పొడిని ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంచుకోండి. మెరుగైన జీర్ణక్రియ కోసం దీన్ని అన్ని కూరల్లో వేసుకోండి. అలాగే సలాడ్లపై చల్లుకోండి. సూపుల్లో కలుపుకోండి. ఇలా ధనియాలు ఏదో ఒక రకంగా మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
ధనియాల రసాన్ని తయారు చేసుకొని తిన్నా మంచిదే. చారు చేసుకునేటప్పుడు ధనియాల పొడిని అధికంగా వేసి చిక్కగా చేయండి. దీన్ని సూప్ లాగా తాగండి. ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు నీటిలో రాత్రంతా ధనియాల గింజలను నానబెట్టి ఉదయం లేచాక వడకట్టుకొని ఖాళీ పొట్టతో ఆ నీటిని తాగిన చాలు. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గడం చాలా సులువుగా మారుతుంది.