గొంతు నొప్పితో మీకు కోవిడ్-19 సోకిందో లేదో తెలుసుకోవచ్చు... అది ఎలాగంటే!
18 July 2022, 22:10 IST
throat can determine if you have contracted Covid-19: దేశంలో మరొసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంతే కాదు సీజనల్ వ్యాధులు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధరణ జ్వరానికి, కరోనాకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
throat can determine if you have contracted Covid-19
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వర్షాకాలం మొదలు కావడంతో కొవిడ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో సీజన్‌లో వచ్చే జలుబుకు, కరోనాకు మధ్య వ్యత్యాసాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది. ముఖ్యంగా SARs-CoV-2 వైరస్ శ్వాసకోశ వ్యాధులకు పర్యాయపదంగా మారింది. సాధారణంగా వచ్చే శ్వాసకోశం ఇబ్బందుల వలే SARs-CoV-2 సోకినప్పుడు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో జలుబును సీరియస్‌గా తీసుకుని చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధరణ జలుబు, కరోనా మధ్య తేడాను గుర్తించి అప్రమత్తమవడానికి నిపుణులు కొన్ని సలహలు ఇస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి
సీజన్ మార్పు వల్ల చాలా మందికి దగ్గు, జలుబుతో కూడిన వైరల్ జ్వరాలు వస్తుంటాయి. ఈ సమయంలో గొంతు నొప్పి ఉంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గొంతు నొప్పి అనేది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా తలెత్తే అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. అలాగే జ్వరం, దగ్గు, ముక్కు కారటం, తుమ్ములు వంటివి కోవిడ్, సాధారణ జలుబు/ఫ్లూలలో కనిపిస్తాయి. మరి వీటిని ఎలా గుర్తించాలి.
కోవిడ్, నాన్ కోవిడ్‌లో గొంతు నొప్పి మధ్య తేడా
కోవిడ్, సాధారణ జలుబు/ఫ్లూ మధ్య తేడాను గుర్తించడానికి ఉత్తమ మార్గం వ్యాధి తీవ్రత. వైరస్‌ల ద్వారా వచ్చే ప్లూల వల్ల వేగంగా ఆరోగ్యం క్షీణిస్తోంది. కోవిడ్-19లో వచ్చే ఫ్లూ లేదా జలుబు సులభంగా వ్యాప్తి చెందుతుంది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. UKకు చెందిన ZOE కోవిడ్ సింప్టమ్ స్టడీ తెలిపిన వివరాల ప్రకారం, గొంతు నొప్పి అనేది కోవిడ్ ప్రారంభ సంకేతమని తెలిపారు. అయితే కోవిడ్ సమయంలో వచ్చే గొంతు నొప్పి ఐదు రోజుల పాటు ఉంటుందని సింప్టమ్ స్టడీ నిపుణులు తెలిపారు. స్టడీ వివరాల ప్రకారం, ఎవరైనా ఐదు రోజుల పాటు గొంతు నొప్పితో బాధపడుతుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ సమయంలో వచ్చే గొంతు నొప్పి ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. సాధారణ అనారోగ్య సమయంలో అరంభంలోనే నొప్పి ఉంటుందని.. చాలా త్వరగా మెరుగుపడుతుందని వెల్లడించారు. కోవిడ్ అరంభంలో మొదటి రోజున గొంతు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుందని.. కానీ మరుసటి రోజు మెరుగుపడుతుందని ZOE పరిశోధకులు వివరించారు. గొంతు నొప్పి COVID-19 సమయంలో వచ్చే సాధారణ లక్షణం కాగా, , కోవిడ్ సోకిన వారిలో 69% మందిలో తలనొప్పి కూడా వస్తున్నట్లు ఇది కరోనా ప్రధాన లక్షణమని ZOE కోవిడ్ యాప్ నిర్వహుకులు తెలిపారు.
కోవిడ్-19 ఇతర సంకేతాలు, లక్షణాలు
ఒక వ్యక్తి క్రింది లక్షణాలతో బాధపడుతుంటే, కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి
జ్వరం లేదా చలి
- దగ్గు
- అలసట
- కండరాలు లేదా శరీర నొప్పులు
- రుచి లేదా వాసన తెలియకపోవడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- ముక్కు కారటం
- వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి జీర్ణశయ సమస్యలు
కోవిడ్ గొంతు నొప్పికి నివారణలు
గొరు వెచ్చని నీరు త్రాగాలి, హైడ్రేటెడ్‌గా ఉండాలి. గొంతులో చికాకు, మంటను తగ్గించడానికి ఆ నీటిలో చెంచా తేనెను కూడా కలపవచ్చు.
ఉప్పునీటితో పుక్కిలించాలి. మీరు గొంతును చప్పరిస్తూ ఉండాలి, ఇది మీ గొంతును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
తగినంత విశ్రాంతి తీసుకోవాలి, తద్వారా మీ శరీరం రోగనిరోధక వ్యవస్థ రీఛార్జ్ చేయబడుతుంది. ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోగలదు.
ఇంటి నివారణలు తగ్గకపోతే, నొప్పిని తగ్గించడానికి వైద్యులు సూచించిన ఓవర్-ది-కౌంటర్ మందులను తీసుకోవచ్చు.