తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bottle Guard Rice: సొరకాయ పులావ్ సులభంగా, రుచిగా ఇలా చేసుకోండి

bottle guard rice: సొరకాయ పులావ్ సులభంగా, రుచిగా ఇలా చేసుకోండి

23 April 2023, 13:41 IST

google News
  • bottle guard rice : తక్కువ దినుసులతో, సులభంగా తయారు చేసుకోగలిగే సొరకాయ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది తిన్నాక పొట్ట నిండుగా, లైట్ గా అనిపిస్తుంది. 

సొరకాయ పులావ్
సొరకాయ పులావ్ (unsplash.)

సొరకాయ పులావ్

లంచ్ బాక్స్ లోకి, మధ్యాహ్న భోజనంలోకి సులభంగా చేయగలిగే వంటకాల్లో సొరకాయ పులావ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది తింటే చాలా మంచిది. తక్కువ మసాలాలు వాడి చేయడం వల్ల కడుపు నిండిన భావనతో పాటూ పొట్ట తేలికగా అనిపిస్తుంది. సొరకాయ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

సొరకాయ తురుము- 3 కప్పులు

బాస్మతీ బియ్యం - 1 కప్పు

ఉల్లిపాయ - 1, పెద్దది

కొత్తీమీర - అరకట్ట

నెయ్యి లేదా నూనె- 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర- 1/2 టీస్పూన్

లవంగాలు- 2

దాల్చిన చెక్క- చిన్న ముక్క

పచ్చిమిర్చి - 4

ఉప్పు- తగినంత

ధనియాల పొడి - 1/2 టేబుల్ స్పూన్

గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్

 

తయారీ విధానం:

ముందుగా కడాయిలో నూనె/ నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర వేయాలి. అది చిటపటమన్నాక నిలువుగా తరుగుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి వేగాక లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసేయండి. వేగిన వాసన వస్తుంటే సన్నగా నిలువుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. రంగు మారాక ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలపండి. ఇప్పుడు సొరకాయ తురుము కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి నూనెలో మగ్గిన తరువాత ఇందులోనే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసేయాలి. చివరగా ఉప్పు కొత్తిమీర కూడా వేసి బియ్యం విరిగిపోకుండా మెల్లగా అడుగంటకుండా కలపుతూ ఉండాలి. దాదాపుగా సొరకాయలో నుంచి వచ్చే నీళ్లతోనే బియ్యం ఉడికిపోతుంది. సరిపోవనుకుంటే ఒక కప్పు నీళ్లు పోసి ఉడకనివ్వండి. పది నిమిషాల్లో వేడి వేడి సొరకాయ పులావ్ సిద్ధం అయిపోతుంది.

 

 

 

 

 

తదుపరి వ్యాసం