తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Cleaning: గ్యాస్ వెనక టైల్స్, గోడ జిడ్డుగా మారాయా? వీటితో తుడిస్తే మెరిసిపోతాయి

Kitchen cleaning: గ్యాస్ వెనక టైల్స్, గోడ జిడ్డుగా మారాయా? వీటితో తుడిస్తే మెరిసిపోతాయి

26 September 2024, 12:30 IST

google News
  • Kitchen cleaning: వంటగదిలో గ్యాస్ వెనకాల ఉండే టైల్స్ మీద తరచూ నూనె పడి జిడ్డుగా మారతాయి. దాంతో నల్లగా, అశుభ్రంగా మారిపోతాయి. వీటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు తెల్సుకోండి. మరకలు సులువుగా వదిలిపోతాయి. 

కిచెన్ టైల్స్ శుభ్రం చేసే చిట్కాలు
కిచెన్ టైల్స్ శుభ్రం చేసే చిట్కాలు (Shutterstock)

కిచెన్ టైల్స్ శుభ్రం చేసే చిట్కాలు

వంటగదిలో గ్యాస్ వెనకాల ఉండే టైల్స్ ఊరికే జిడ్డుగా అయిపోతాయి. తాలింపు వేసినప్పుడు నూనె పడటం, పొగ వల్ల అవి మురికిగా మారిపోతాయి. దాంతో అలాగే వదిలేస్తే మరింత దుమ్ము చేరి నల్లగానూ మారతాయి. వాటి దగ్గరికి పురుగులు వచ్చి చేరతాయి. దాన్ని కొన్ని చిట్కాలు తెల్సుకున్నారంటే సులభంగా శుభ్రం చేయొచ్చు. దానికన్నా ముందు కొన్ని హ్యాక్స్ కూడా తెల్సుకుంటే అసలు మురికే అవ్వకుండా చూసుకోవచ్చు.

జిడ్డు అవ్వకుండా ఉండాలంటే..:

వంట చేయడం వల్ల వచ్చే నూనె, పొగ వల్ల వంటగది గోడలు నల్లబడకుండా ఉండేందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. రిమూవబుల్ వాల్ పేపర్ స్టిక్కర్లు దొరుకుతున్నాయి. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాటిని టైల్స్ మీద అతికిస్తే సరిపోతుంది. పాడైపోగానే వీటిని సులభంగా తీసేయొచ్చు. వీటిలో అసలు స్టిక్కర్ వేసినట్లే తెలీని ట్రాన్స్‌పరెంట్ రకాలు, అనేక రంగులు, ప్రింట్లున్నవీ ఉంటున్నాయి.

అలాగే వంటగదిలో చిమ్నీ పెట్టే వీలులేకపోతే కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పొగ, జిడ్డు పేరుకోదు.

నూనె వేడెక్కాక తాలింపు దినుసులు, కరివేపాకు లాంటివి వేసేటప్పుడు స్టవ్ ఒకసారి కట్టేయండి. దాంతో కాస్త వేడి తగ్గి నూనె బయటికి చిల్లకుండా ఉంటుంది.

జిడ్డు వదిలించే చిట్కాలు:

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్ ను వంటగదిలోని ఈ నలుపెక్కిన, జిడ్డుగా మారిన గోడలు లేదా టైల్స్ శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక గుడ్డపై జెల్ లాగా ఉండే టూత్ పేస్ట్ వాడండి. ఇప్పుడు ఈ గుడ్డతో మురికి ఉన్న చోట రుద్దితే వెంటనే మార్పు తెలుస్తుంది. చాలా సులభంగా జిడ్డు పోతుంది. తర్వాత మరో గుడ్డను నీళ్లలో ముంచి శుభ్రం చేస్తే చాలు. గోడలు మామూలుగా మునుపటి మెరుపుతో కనిపిస్తాయి.

డిష్ వాష్ లిక్విడ్:

డిష్ వాష్ లిక్విడ్ సహాయంతో గోడలపై ఉన్న నల్లటి పొగ మరకలను కూడా తొలగించవచ్చు. దీని కోసం ఒక మగ్గులో నీళ్లు పోసి అందులో 10-15 చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. దీంట్లో ఒక స్పాంజి లేదా తడిగుడ్డ ముంచి కిచెన్ గోడను రుద్దాలి. చాలా సులువుగా మురికి అంతా వదిలపోతుంది చూడండి.

సర్ఫ్:

గోరువెచ్చని నీరు మరియు సర్ఫ్ సహాయంతో వంటగదిలో నల్లగా ఉన్న గోడలను శుభ్రం చేయవచ్చు. ముందుగా తడి గుడ్డతో గోడను కాస్త తుడవాలి. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా డిటర్జెంట్ కలపాలి. ఇప్పుడు అందులో స్పాంజ్‌ను ముంచి బాగా పిండేసి రుద్దుతూ గోడను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల గోడపై ఉన్న మరకలు సులువుగా తొలగిపోతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం