Hot Water : వేడినీళ్లు తాగితే లాభాలున్నాయి సరే.. మరి నష్టాల సంగతేంటి..?
03 August 2022, 15:14 IST
- వేడినీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది వేడినీరు తాగేందుకు మొగ్గు చూపుతారు. అయితే వేడినీరు అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
వేడినీటి వల్ల కలిగే లాభాలు, నష్టాలు
Hot Water Disadvantages : మీరు ఫిట్‌నెస్ ఔత్సాహికులైనా.. లేదా ముఖ్యంగా మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. ఉదయం పూట మీరు చేసే మొదటి పని వేడి నీరు తాగడం. కప్పు వేడి నీటితో చాలామంది తమ రోజును ప్రారంభిస్తారు. ఎందుకంటే వేడి నీటికి శరీరాన్ని శుభ్రపరిచే అసమానమైన సామర్థ్యం కలిగి ఉంది. అందుకే కొంతమంది రోజంతా వేడినీరు కూడా తాగుతారు. అయితే అతిగా వేడినీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని హానికరమైన ప్రభావాలు కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే ముందుగా వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
1. జీర్ణక్రియలో సహాయపడుతుంది
వేడి నీరు జీర్ణవ్యవస్థను సున్నితంగా చేస్తుంది. ఇది చల్లటి నీటి కంటే వేగంగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. వేడి నీరు పేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
2. టాక్సిన్స్‌ను తొలగిస్తుంది..
వేడి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట పట్టేలా చేస్తుంది. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. నిజానికి మీరు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే.. గోరువెచ్చని నీటిని సిప్ చేయడం వలన ఉపశమనం లభిస్తుంది.
3. అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది..
వేడి నీరు చర్మ కణాలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ చర్మం మరింత సాగేదిగా ఉంటుంది. ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌ను అభివృద్ధి చేసే అవకాశం తక్కువ. నిజానికి మీ చర్మం మృదువుగా మారుతుంది. ఫలితంగా యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
4. బరువు తగ్గడం
ఉదయం పూట వేడినీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆ అదనపు కిలోలను తగ్గించడంలో మీకు సహాయం చేస్తుంది.
5. అలర్జీలతో పోరాడుతుంది
జలుబు, నాసికా అలెర్జీల వల్ల కలిగే సైనస్‌లపై ఒత్తిడిని వేడి నీరు తగ్గించగలదు. ఇది సైనస్‌లను అన్‌లాగ్ చేస్తుంది. ఇది శ్లేష్మాన్ని త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది.
6. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..
గోరువెచ్చని నీరు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
7. నెలసరి తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది
ఋతు చక్రం సమయంలో.. గోరువెచ్చని నీరు తాగితే కడుపు నొప్పి, తిమ్మిరిని అధిగమించడానికి సహాయం చేస్తుంది.
వేడి నీటిని తాగడం వల్ల కలిగే కొన్ని నష్టాలు
అతిగా చేస్తే ఏదైనా హానికరం. వేడినీరు ఎక్కువగా తాగడంలోనూ ఇదే వర్తిస్తుంది. అందుకే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నీరు చాలా వేడిగా ఉంటే.. అది మీ నాలుక, రుచి మొగ్గలను కాల్చివేస్తుంది.
* ఇది అన్నవాహిక, కడుపు వంటి అంతర్గత అవయవాలకు కూడా హాని కలిగించవచ్చు.
* పడుకునే ముందు వేడి నీటిని తాగడం వలన మీ నిద్ర చక్రం కాస్త గందరగోళానికి గురవుతుంది.
టాపిక్