తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brokini | బికీనిలు ఆడవారికి మాత్రమేనా మగవారికి లేవా? ఎందుకు లేవు ఇదిగో బ్రొకిని!

Brokini | బికీనిలు ఆడవారికి మాత్రమేనా మగవారికి లేవా? ఎందుకు లేవు ఇదిగో బ్రొకిని!

Manda Vikas HT Telugu

13 April 2022, 18:36 IST

    • గోవా, బ్యాంకాక్ లాంటి బీచ్ లలో చాలా మంది విదేశీ వనితలు బికీనిల్లో దర్శనమిస్తారు. అవి స్విమ్ చేసేటపుడు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మరి మగవారికి బికీనిల లాంటి దుస్తులు ఏమైనా ఉన్నాయా అంటే? మా వద్ద ఉన్నాయంటున్నారు ఇద్దరు మగజాతి ఆణిముత్యాలు. వివరాల్లోకి వెళ్లండి..
Brokini- swimsuit for men
Brokini- swimsuit for men (brokinis)

Brokini- swimsuit for men

ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేనపుడు చిన్న గుడ్డ పేలికలతో సర్దుకుపోయేవారు అప్పట్లో ఆది మానవులు. ఆ తర్వాత అదే ఫ్యాషన్ స్విమ్మింగ్ చేసేటపుడు వచ్చింది. వాటినే బికీనిలు అని పిలవడం ప్రారంభించారు. అర్బన్ ఏరియాలలో హైఫై అమ్మాయిలు స్విమ్మింగ్ చేసేటపుడు బికీనిలే ధరిస్తారు. ఇండియాలో అయితే గోవా. అలాగే బ్యాంకాంక్, మాల్దీవ్స్, కెనడా లాంటి దేశాలలో బీచ్‌కు వెళ్తే చాలా మంది అమ్మాయిలు బికీనిలతోనే దర్శనం ఇస్తారు. అయితే పొదుపుగా బికీనిలు ధరించిన మాత్రానా వారేం పేదవారు కాదు. ఎందుకంటే బికీనిలు ఏం తక్కువ ధరలో లభించవు. మన వద్ద ఒక్కో బికీని రూ. 150 నుంచి ప్రారంభమై రూ. 2500 వరకు ఉన్నాయి. గుడ్డ ఎంత తక్కువ ఉంటే ధర అంత ఎక్కువగా ఉంటుంది. మళ్లీ వీటిని బేరం కూడా ఆడలేం. ఎందుకంటే బికీనో రక్షతి రక్షిత: అన్నాడో మహానుభావుడు.

సరే.. మరి మగవారికి బికీనిలు వద్దా? వారు చిన్న నెక్కర్ తోనే సర్దుకుపోవాలా? వారికి ఫ్యాషన్ తెలియదా? ఈరోజుల్లో మగవారు కూడా పూలపూల బట్టలు వేసుకుంటున్నారు, దువ్విన తలనే దువ్వుతూ ఉంటున్నారు, అద్దిన పౌడరు అద్దుతూ ఉంటున్నారు, మెన్స్ బ్యూటీ పార్లర్లకు వెళ్లి గంటలు గంటలు మేకప్ వేసుకుంటున్నారు. మార్కెట్లో కూడా అనేక రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాలు మగవారి కోసం, ఆడవారి కోసం విడివిడిగా అమ్ముతున్నారు. మరి బికీనిల సంగతేంటి..? ఆడవారికి మాత్రమే బికీనిలు ఉంటే లింగ సమానత్వం ఎక్కడుంటుంది?

ఇదిగో ఇలాంటి ఆలోచనలతోనే ఇద్దరు మగజాతి ఆణిముత్యాలు మగవారి కోసం కూడా బికీనిలు తయారు చేశారు. వీటినే వాళ్లు 'బ్రొకిని' అని పేరుపెట్టి పిలుస్తున్నారు.

కెనడాలోని టొరొంటోకి చెందిన చాడ్ సాస్కో, టేలర్ ఫీల్డ్ అనే ఇద్దరు యువకులు పురుషుల కోసం ప్రత్యేకమైన బీచ్‌వేర్‌లను డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఇందుకోసం Brokinis అనే వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. వారి స్టోర్లో ఒక్కో బ్రొకిని ధర 40 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మన కరెన్సీ ప్రకారం రూ. 3 వేల పైమాటే.

మరి మగవారు ఇలాంటి బ్రొకిని ఒకటి ధరించి బీచ్‌లో గనక తిరిగితే అందరి కళ్లు మీవైపే. అయితే ఇక్కడ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ చుట్టుపక్కలు కుక్కలు లేకుండా చూసుకోండి. అవి గానీ వెంటపడి ఉన్న కాస్త గుడ్డను పీకి పారేస్తే మొదటికే మోసం రావొచ్చు.