తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fat Loss | కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..

Fat Loss | కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..

HT Telugu Desk HT Telugu

20 April 2022, 12:42 IST

google News
    • మన శరీరం సరిగ్గా పనిచేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ.. అది ఎక్కువ మోతాదులో ఉంటే.. మన ధమనులను అడ్డుకుంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక్కోసారి మరణానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించుకోవడం అనేది అనివార్యం. జీవనశైలిలో మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గేందుకు చిట్కాలు
బరువు తగ్గేందుకు చిట్కాలు

బరువు తగ్గేందుకు చిట్కాలు

Cholesterol Control | అధిక ఎల్‌డిఎల్ స్థాయి (చెడు కొలెస్ట్రాల్) ధమనులలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. హెచ్‌డిఎల్ (మంచి కొలెస్ట్రాల్) శరీరంలోని ఇతర భాగాల నుంచి కొలెస్ట్రాల్‌ను కాలేయానికి తీసుకువెళుతుంది. ఈ క్రమంలో జీవనశైలిలో మార్పులు మన కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా అన్ని ఆహార పదార్థాలలో.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం అనేది అనివార్యం. ఈ విషయంలో ఫైబర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫైబర్ జీర్ణాశయం నుంచి... రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. ఓట్స్, పండ్లు, తాజా కూరగాయాలు, తృణధాన్యాలు కలిగిన ఆహారాలు కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఫైబర్ వల్ల కరగని కొవ్వును.. తేలికపాటి వ్యాయామాలు తగ్గిస్తాయి.

వ్యాయామం

రోజూ వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అందుకే వ్యాయామాలు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వ్యాయామం మీ గుండె, మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. రోజులో కొంచెం సేపు వేగంగా నడవండి. పరుగెత్తండి. లేదా యోగా చేయండి. ఏకాగ్రతగా చేయడంలో సమస్య ఉంటే, జిమ్ లేదా వర్కౌట్ క్లాస్‌లో చేరండి. లేదంటే ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఉండేవారితో స్నేహం చేయండి. వారు మిమ్మల్ని ప్రతిరోజూ వ్యాయామం చేసేలా చేస్తారు.

ఫైబర్ ఉండే ఆహారాలు..

హృదయానికి అనుకూలమైన ఆహారాన్ని తినండి. మీ ఎల్​డీఎల్​ స్థాయిని తగ్గించడానికి ఎరుపు మాంసం లేదా పూర్తి కొవ్వు ఉన్న పాలు వంటి సంతృప్త కొవ్వులను తీసుకోవడం తగ్గించండి. సాల్మన్, వాల్‌నట్‌లు, అవిసె గింజలు వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. బీన్స్, వంకాయ, ఓక్రా వంటి ఫైబర్ కలిగిన తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలు తీసుకోండి. వెన్న స్థానంలో కూరగాయల నూనెలు తీసుకోవడం కూడా మంచిదే.

చక్కెర తగ్గించాలి..

తరచూ మీ బరువును చెక్ చేసుకోండి. అదనపు బరువు పెరగడం వలన.. అనేక రుగ్మతలు, వ్యాధులను పెంచుతాయి. ఎక్కువ బరువును కోల్పోవాల్సిన అవసరం లేదు కానీ.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి. చక్కెర, కొవ్వు పదార్ధాల తీసుకోవడం తగ్గించాలి. చక్కెర పానీయాల నుంచి నీరు, సహజ పండ్ల రసాలు లేదా చక్కెర జోడించని స్మూతీలకు మారండి. అదనపు బరువును తగ్గించుకోవడానికి శారీరకంగా మరింత చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి.

మసాలాలు తగ్గించండి..

పసుపు, అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు, కొత్తిమీర, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు మీ ఆహారానికి రుచిని జోడించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే.. 9% కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుందని వెల్లడించాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మసాలలను తగ్గించడం చాలా మంచిది.

ఒత్తిడిని తగ్గించుకోండి..

ఒత్తిడి చెడు కొలెస్ట్రాల్‌కు దారి తీస్తుంది. మీ కోసం సమయాన్ని వెచ్చించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆందోళనను దరి చేరనీయకుండా.. మనస్సును శాంతపరచడానికి ధ్యానం, యోగా చేయండి. ఒత్తిడి లేకుండా జీవితంలో విషయాలను క్రమబద్ధీకరించండి. నవ్వడం వల్ల మీ శరీరంలో హెచ్‌డిఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. కాబట్టి మీ జాబితాకు కొంత వినోదాన్ని జోడించండి. ఫన్నీ వీడియోలు, హాస్య చిత్రాలను చూడండి. స్టాండ్-అప్ కామెడీ షోకు హాజరై.. నవ్వండి.

టాపిక్

తదుపరి వ్యాసం