తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Newyear Events Vizag: విశాఖపట్నంలో న్యూ ఇయర్ పార్టీలు గ్రాండ్‌గా జరిగే ప్రదేశాలు ఇవే

NewYear Events Vizag: విశాఖపట్నంలో న్యూ ఇయర్ పార్టీలు గ్రాండ్‌గా జరిగే ప్రదేశాలు ఇవే

Haritha Chappa HT Telugu

11 December 2024, 16:30 IST

google News
    • NewYear Events Vizag: కొత్త ఏడాది వచ్చిందంటే డిసెంబర్ 31 రాత్రి పార్టీ ఎక్కడ చేసుకోవాలని స్నేహితులంతా ముందే ప్లాన్ చేసుకుంటారు. వైజాగ్‌లో ఉన్నవారు ఇక్కడ మేము ఇచ్చిన ప్రాంతాల్లో పార్టీని ఘనంగా చేసుకోవచ్చు.
వైజాగ్ లో న్యూ ఇయర్ పార్టీలు
వైజాగ్ లో న్యూ ఇయర్ పార్టీలు (Bookmyshow)

వైజాగ్ లో న్యూ ఇయర్ పార్టీలు

న్యూఇయర్ 2025కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధం అయిపోతున్నారు. ఈ ఏడాదిలో చివరి నెల వచ్చేసింది. డిసెంబర్ 31 రాత్రి ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యువత ఉర్రూతలూగుతోంది. జీవితంలో కొత్త ఆశలను మోసుకొచ్చే కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు న్యూయార్ పార్టీల్లో పాల్గొనేవారు ఎంతోమంది. మీరు విశాఖపట్నంలో నివసిస్తున్న వారైతే ఇక్కడ ఏ ప్రాంతంలో గ్రాండ్ గా పార్టీలు జరుగుతాయో సమాచారాన్ని ఇచ్చాము. మీకు నచ్చిన చోటకు వెళ్లి మీరు పార్టీలను ఎంజాయ్ చేయవచ్చు.

శ్రీరామచంద్ర లైవ్

సింగర్ శ్రీరామచంద్ర కొత్త ఏడాదిని వైజాగ్‌లోనే స్వాగతం పలకబోతున్నారు. డిసెంబర్ 31 రాత్రి ఎనిమిది గంటల నుండి ఆయన తన పాటలతో వైజాగ్ వాసులను అలరిస్తారు. శ్రీరామచంద్ర లైవ్ న్యూ ఇయర్ ఈవెంట్... పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగబోతోంది. మీరు ఈ ఈవెంట్ కు వెళ్లాలనుకుంటే 999 రూపాయలు చెల్లించి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు బుక్ మై షో వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక్కడ లైవ్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూనే రకరకాల డ్రింక్స్‌ను రుచికరమైన ఆహారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్‌తో వెళ్లడానికి ఇది బెస్ట్ ప్లేస్.

వెల్కమ్ 25 న్యూ ఇయర్ పార్టీ

విశాఖపట్నంలో ఫార్చ్యూన్ ఇన్ శ్రీ కన్య లో కూడా న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. డీజేలు, మ్యూజిక్ బ్యాండ్లు, రేపర్లు, అన్ లిమిటెడ్ ఫుడ్, అన్ లిమిడెట్ డ్రింకులతో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి 7 గంటలకు అందరూ అక్కడికి చేరుకుంటే సరిపోతుంది. దీని కోసం ముందుగా మీరు 2499 రూపాయలు చెల్లించి టికెట్‌ను బుక్ చేసుకోవాలి. మాక్ టెయిల్స్, అన్ లిమిటెడ్ ఫుడ్ తో పాటు అనేక రకాల పోటీలు కూడా ఇక్కడ జరుగుతాయి. గెలిచిన వారికి బంగారు నాణేలను కూడా అందిస్తారు. డీజేలకు తగ్గట్టు డాన్సులు కూడా చేస్తారు. అన్ని వయసుల వారు దీనికి వెళ్ళవచ్చు. ఎక్కువమంది యువత దీంట్లో పాల్గొంటారు.

ఆర్కే బీచ్

వైజాగ్ లో ప్రసిద్ధమైన టూరిస్ట్ స్పాట్లలో ఆర్కే బీచ్ కూడా ఒకటి. ఆర్కే బీచ్‌కు డిసెంబర్ 31 రాత్రి ఎంతోమంది చేరుకుంటారు. అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటారు. ఆర్కే బీచ్‌కి వెళ్లేందుకు ఇలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఆర్కే బీచ్ లో గడిపి రావచ్చు.

బీచ్ రోడ్డు

వైజాగ్ బీచ్ రోడ్‌లో కూడా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. బీచ్ రోడ్డు అంతా విద్యుత్ దీపాలతో కళకళలాడిపోతుంది. ఎవరైనా కూడా ఆ ప్రాంతానికి వెళ్లొచ్చు. ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అనేక రకాల ఆహారాలు, డ్రింకులు కూడా అక్కడ లభిస్తాయి. గాల్లో ఎగరేసేందుకు బెలూన్‌లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఖర్చు లేకుండా కొత్త ఏడాదిని ఘనంగా స్వాగతించాలంటే బీచ్ రోడ్ బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు.

తదుపరి వ్యాసం