తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Boy Names: ట్రెండీ బేబీ బాయ్స్ పేర్లు ఇవిగో, ఈ పేర్లు ఎంతో అందంగా ఉంటాయి

Baby boy Names: ట్రెండీ బేబీ బాయ్స్ పేర్లు ఇవిగో, ఈ పేర్లు ఎంతో అందంగా ఉంటాయి

Haritha Chappa HT Telugu

28 November 2024, 12:37 IST

google News
    • Baby boy Names: మీ ఇంట్లో మగబిడ్డ పుడితే… ఆ చిట్టి తండ్రికి అందమైన పేరు కోసం వెతుకుతుంది కుటుంబమంతా. మీ కోసమే ఇక్కడ మేము ట్రెండీ పేర్లు ఇచ్చాము. ఇవి కొత్తగా, అందంగా ఉంటాయి.
బేబీ బాయ్ నేమ్స్
బేబీ బాయ్ నేమ్స్

బేబీ బాయ్ నేమ్స్

ఇంట్లో మగబిడ్డ పుట్టగానే కుటంబమంతా ఆనందపడుతుంది. తమ జీవితాల్లోకి ఒక చిట్టి తండ్రి అడుగు పెట్టాడని సంతోషిస్తారు. అతనికి అందమైన, అర్ధవంతమైన పేర్లు వెతికేంతుకు ప్రయత్నిస్తారు. మీరు మీ బిడ్డకు ట్రెండీ, కొత్త పేర్ల కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ మేము కొన్ని పేర్లను ఇచ్చాము. ఇందులో ఎన్నో అబ్బాయిల పేర్లు ఉన్నాయి. వీటన్నింటికి అర్ధాలున్నాయి. ఇక్కడ మేము పేరుతో సహా అర్థాన్ని కూడా ఇచ్చాము. కాబట్టి మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకున్నాము.

బేబీ బాయ్స్ నేమ్స్

  1. శర్విల్ - శ్రీ కృష్ణుని వేలాది పేర్లలో ఇది ఒకటి.
  2. శౌర్య - ధైర్య సాహసాలు అనే అర్థం దీనికి వస్తుంది.
  3. సోహన్ - ఈ పదం భగవంతుడిని సూచిస్తుంది.

4. హర్షిల్ - ఈ పేరుకి అర్థం ఆనందం నిండిన వ్యక్తి అని.

5. విహాన్ - ఈ అందమైన పేరుకు ఉదయం అని అర్థం.

6. విభవ్ - విశ్వాన్ని కాపాడే సంరక్షకుడు అని అర్థం ఈ పేరుకు.

7. రుద్రన్ - శివును పేరు నుంచి పుట్టినది ఇది.

8. తనీష్ - త అక్షరంతో మొదలయ్యే ఈ పేరుకు ఆశావహ వ్యక్తి అని అర్థం.

9. తేజస్ - ఇది ఈ కాలానికి చెందిన ట్రెండీ పేరు. దీనికి అర్ధం కాంతి.

10. దక్ష్ - ఈ పేరుకు అర్థం నాయకత్వం వహించే వ్యక్తి అని.

11. దివిజ్ - ఈ పేరుకు అర్థం స్వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అని.

12. సహన్ - ఎంతో సహనంగా ఉండే వ్యక్తి అని అర్ధం.

13. పార్ధ్ - మహాభారంతో అర్జునుడిని పార్ధుడు అని కూడా అంటారు.

14. ఆద్విక్ - అందరితో పోలిస్తే ప్రత్యేక మైన వ్యక్తి అని అర్థం.

15. ఆయుష్షు - దీర్ఘాయుష్షుతో జీవించే వ్యక్తి.

16. ఆరవ్ - ప్రశాంతంగా ఉండే వ్యక్తి అని అర్థం.

17. ఇషాన్ - విశ్వాన్ని శాసించే వ్యక్తి అని అర్థం.

18. రిషి - కాంతి కిరణం, ఆనందం వంటి అర్థాలు వస్తాయి.

19. కియాన్ష్ - ప్రతిభతో కలిగిన వ్యక్తి అని అర్థం.

20. అద్వయ్ - ఈ పేరుకు అర్థం ప్రత్యేకమైన అని.

21. అహన్ - ఇది ఎంతో ట్రెండీ పేరు. దీనికి మొదటి కాంతి కిరణం అని అర్థం.

22. అవ్యయ్ - కొత్త ప్రారంభం అని పేరుకు అర్థం

23. అవిక్ - దేనికీ భయపడని వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.

24. అహాన్ - కొత్త ఆరంభం, కొత్త రోజు అని ఈ పేరుకు మీనింగ్

25. తీర్థ్ - పవిత్రమైన ప్రదేశం అని అర్థం.

26. ఉద్దీప్ - వెలుగును చిమ్మడం, దీపం వెలిగించడం అని పేరుకు మీనింగ్

27. విహాస్ - శ్రీకృష్ణుని పేర్లలో ఇదీ ఒకటి

28. యువిన్ - ఈ పేరుకు అర్థం నాయకుడు అని

29. యుగ్ - ఈ పేరుకు ఒక తరం అని అర్థం.

30. శ్రీహన్ - ఈ పేరుకు విష్ణువు అని అర్థం.

తదుపరి వ్యాసం