తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Sankranti 2024 : సంక్రాంతి శుభాకాంక్షలు.. ఇలా చెప్పేయండి

Happy Sankranti 2024 : సంక్రాంతి శుభాకాంక్షలు.. ఇలా చెప్పేయండి

Anand Sai HT Telugu

14 January 2024, 15:30 IST

google News
    • Sankranti Wishes Telugu : కొత్త ఏడాదిలో మెుదటి పండగ వచ్చేసింది. సంక్రాంతి వేడుకలు ఊరూవాడ ఘనంగా జరుగుతున్నాయి. అయితే మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోట్స్ ఇక్కడ ఉన్నాయి.
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు

2024లో మెుదటి పండగ అయిన సంక్రాంతి వేడుకలు మెుదలయ్యాయి. సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఆనందంగా ఉంటారు. పంట సంబరం, పశువులు పూజించడం.. ఇలా సంక్రాంతి పండగ ప్రత్యేకతలే వేరు. ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి. రైతుల ఇళ్లలో ఉత్సాహాన్ని నింపే పండుగ సంక్రాంతి. ఈ పండుగ శ్రేయస్సుకు ప్రతీక. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. అందుకోసం ఇక్కడ కొన్ని కోట్స్ అందించాం..

మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

సంవత్సరంలో మొదటి పండుగ అయిన మకర సంక్రాంతి అందరికి కొత్త ఉత్సాహం, శాంతిని ప్రసాదించుగాక.. Happy Sankranti

నువ్వులు బెల్లం తిని మంచిగా మాట్లాడుకుందాం. తియ్యని వేడుకలు చేసుకుందాం.. గత ఏడాది చేదునంతా మరచి తీపి మాటల ద్వారా బంధాన్ని పెంచుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు

చేదు జ్ఞాపకం మాయమైపోవాలి, తీపి జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచిపోవాలి, మీ కల సాకారమవ్వాలి. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి.. Happy Sankranti 2024

ఈ పండగ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆరంభాలు మెుదలు కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం.. జనాలకు వెలుగునిచ్చే వెచ్చని రవి కిరణం.. హ్యాపీ సంక్రాంతి

ప్రకాశించే సూర్యుడు మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సు, సంతోషంతో నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

ఈ సంక్రాంతి మెరుపు మీ జీవితంలోని అన్ని చేదుసంఘటనలను కాల్చివేసి, మీ జీవితంలో ఆనందాన్ని ఆనందాన్ని తెస్తుంది. Happy Pongal 2024

ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలి. ఈ శుభ సందర్భంగా గాలిపటం లాగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.. Happy Sankranti 2024

తెల్లవారుజామున ప్రతి వాకిట్లో సంబరాల కాంతి తీసుకురావాలని.., జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2024

ఈ మకర సంక్రాంతి మీ ఇంట కొత్త కాంతులను వెదజల్లాలి.. హ్యాపీ సంక్రాంతి

ఆకుపచ్చని మామిడి తోరణాలు.. పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు.. ముంగిట్లో ముగ్గులు.. అందమైన గొబ్బెమ్మలు.. ఇంటికి వచ్చే ధాన్యపు రాశులు.. Happy Sankranti 2024

ఆకాశంలోకి వెళ్లే పతంగులు.. ఆనందాన్ని ఇచ్చే కోడి పందెలు.. ధాన్యపు రాశులతో నిండిపోయే గాదెలు.. బసవన్నల దీవెనలు.. కీర్తనలు పాడే హరిదాసులు.. తనివి తీరని వేడుక.. సంక్రాంతి పండుగ.. Happy Sankranti

తరిగిపోని ధాన్యపురాశులతో.. తరిగివచ్చే సిరిసంపదలతో.. తేనెలాంటి తియ్యని అనుబంధాలతో.. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Happy Sankranti 2024

తదుపరి వ్యాసం