తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raksha Bandhan Wishes: రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ ఫొటోలు, మెసేజీలతో చెప్పేయండి..

Raksha Bandhan wishes: రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ ఫొటోలు, మెసేజీలతో చెప్పేయండి..

29 August 2023, 18:17 IST

google News
  • Raksha Bandhan 2023 Wishes: ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 30, 31 వ తేదీల్లో జరుపుకోబోతున్నాం. ఈ రోజున మీ ఇష్టమైన వాళ్లకి శుభాకాంక్షలు ఈ ఫొటోలు, సందేశాల ద్వారా తెలియజేయండి. 

రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజీలు
రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజీలు (HT Photo)

రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజీలు

ఆగస్టు 30, 31 వ తేదీల్లో రాఖీ పండగ జరుపుకుంటున్నాం. ఈ రోజున మీ తోబుట్టువులతో మీకున్న బంధాన్ని వేడుకలా జరుపుకుంటారు. సోదరి సోదరులు రాఖీ కట్టుకుంటారు. బహుమతులు, పిండి వంటలు, స్వీట్లు, కొత్త బట్టలు.. ఇలా రాఖీ పండగ అంటేనే వేడుకలా ఉంటుంది. ఈ రోజున మీకిష్టమైన వారికి శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని మంచే మెసెజీలు, ఫొటోలు మీకోసం..

రక్షాబంధన్ శుభాకాంక్షలు

రక్షాబంధన్ మెసేజీలు, సందేశాలు, ఫొటోలు:

  • నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా.

రక్షాబంధన్ ఈ సంవత్సరం రెండు రోజులు జరుపుకోబోతున్నాం.
  • నీకు ఆరోగ్యం, సుఖ శాంతులు, సంతోషం ఎప్పుడూ ఉండాలని, ఈ ప్రపంచంలో ఉన్న మంచంతా నీకు జరగాలని కోరుకుంటున్నా. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.
  • నన్ను ఆపదల నుంచి రక్షించావు, నేను ఏడుస్తున్న ప్రతిసారీ ఓదార్చావు. సూపర్ హీరోలు ఉంటారనేది నిజం అయితే.. నువ్వు నా సూపర్ హీరోవే. నువ్వు నాకోసం చేసిన ప్రతి పనికీ థ్యాంక్యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్.

రక్షాబంధన్ ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకుంటున్నాం.
  • వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రాఖీ పండగ. నీకు రాఖీ పండగ శుభాకాంక్షలు తమ్ముడా..
  • మంచి సోదరుడిగా ఉన్నందుకు థ్యాంక్యూ అన్నయ్య. నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉన్నావ్. నేను నడిచే దారిలో అడ్డంకులు, ఆటంకాలు లేకుండా చూసుకున్నావ్. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య.

సోదరీ, సోదరుడి మధ్య అనుబంధానికి చిహ్నం రాఖీ పండగ
  • నా జీవితంలో నువ్వు ప్రత్యేకం. నీ కోరికలన్నీ నిజం కావాలని ప్రార్థిస్తున్నా. నువ్విలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
  • నువ్ నన్ను ఏడిపిస్తావ్, నువ్వే నన్ను నవ్విస్తావ్, నన్ను ప్రేమిస్తావ్, లాలిస్తావ్.. నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. రాఖీ పండగ శుభాకాంక్షలు.

రాఖీ పండగ 2023
  • ఈ ప్రపంచంలోనే మంచి చెల్లెలు నాకుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. హ్యాపీ రక్షాబంధన్.
  • నీ లాంటి అక్క ఉండటం నా అదృష్టం. నా కోరికలన్నీ తీర్చేది నువ్వే. ఈ సారి కూడా నువ్విచ్చే బహుమతి కోసం ఎదురుచూస్తుంటా. హ్యాపీ రక్షా బంధన్.

శ్రావణ మాసంలో పూర్ణిమ రోజు రాఖీ జరుపుకుంటాం.
తదుపరి వ్యాసం