తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు గుంతపొంగనాలు తిని చూడండి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు, రెసిపీ ఇదిగో

Egg Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు గుంతపొంగనాలు తిని చూడండి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

16 February 2024, 6:00 IST

    • Egg Breakfast: అల్పాహారంలో ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఎప్పుడు ఒకేలాంటి గుంతపొంగనాలకు బదులు ఈసారి కోడి గుడ్డుతో టేస్టీ గుంతపొంగనాలు చేసి చూడండి. ఇవి చేయడం చాలా సులువు.
కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీ
కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీ

కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీ

Egg Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో గట్టిగా తినాలని చెబుతారు పోషకాహార నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ ఎంత గట్టిగా తింటే రాత్రి వరకు అంత ఉత్సాహంగా పనిచేస్తారు. అల్పాహారంలో ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఇడ్లీ, దోశ, పూరి వంటివి తిని బోర్ కొడితే... ఒకసారి కోడిగుడ్డు గుంతపొంగనాలు ప్రయత్నించండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ సమయంలోనే ఇవి రెడీ అయిపోతాయి. పదినిమిషాల్లో వీటిని వండి తినడం కూడా మొదలుపెట్టేయవచ్చు. వీటిని తింటే పొట్ట చాలా సమయం వరకు నిండినట్టు ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు మీరు తినరు, దీనివల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఈ గుంత పొంగనాలకు ప్రత్యేకంగా చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

Chanakya Niti Telugu : భార్య తన భర్త దగ్గర దాచే రహస్యాలు.. ఎప్పుడూ చెప్పదు!

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

గరం మసాలా - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

నిమ్మరసం - అర స్పూను

మిరియాల పొడి - చిటికెడు

కోడిగుడ్డు గుంతపొంగనాలు రెసిపీ

1. ఒక గిన్నె తీసుకొని నాలుగు గుడ్లను కొట్టి అందులో వేయాలి.

2. తరువాత ఆ నాలుగు గుడ్లను బాగా గిలక్కొట్టాలి.

3. ఉల్లిపాయని సన్నగా తరిగి అందులో వేయాలి.

4. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా సన్నగా తరిగి ఆ మిశ్రమంలో కలపాలి.

5. అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గిల కొట్టాలి.

6. అవి బాగా కలిసాక ధనియాలపొడి, పసుపు, గరం మసాలా వేసి మళ్లీ మిక్స్ చేయాలి.

7. చివర్లో మిరియాల పొడిని చల్లుకోవాలి.

8. ఇప్పుడు గుంతపొంగనాలు చేసే పెనాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయించుకోవాలి.

9. కాస్త నూనెను ఆ కళాయిలో ఉన్న గుంతల్లో వేసుకోవాలి.

10. ఇప్పుడు కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆ గుంతల్లో వేయాలి.

11. మంట చాలా చిన్నగా పెట్టుకోవాలి. లేకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి.

12. ఇప్పుడు పైన మూత పెట్టి సరిగ్గా మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఆ గుంతపొంగనాలు రెండోవైపుకు తిప్పుకోవాలి.

13. మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి.

14. అంతే టేస్టీగా గుంతపొంగనాలు రెడీ అయిపోతాయి.

వీటిలో పూర్తిగా కోడిగుడ్లనే వినియోగించాం, కాబట్టి ఎలాంటి చట్నీ అవసరం ఉండదు. తినాలనిపిస్తే టమాటా కెచప్ లో ముంచుకుంటే సరిపోతుంది. ఇందులో మసాలాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్ని వేసాము, కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది.

అల్పాహారంలో కోడిగుడ్డు తింటే ఆ రోజంతా మీకు శక్తి అందుతుంది. కోడిగుడ్లతో చేసిన అల్పాహారాలు తినమని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. నాలుగు కోడిగుడ్లతో చేసిన గుంతపొంగనాలు ఇద్దరికీ సరిగ్గా సరిపోతాయి. అంటే చెరో రెండు గుడ్లు తినడంతో సమానం. అలాగే కోడిగుడ్లతో పాటు ఇందులో వేసిన మసాలాలు, ఉల్లిపాయల వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. పిల్లలకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్‌గా ఈ కోడిగుడ్డు గుంతపొంగనాలు చెప్పవచ్చు. వారికి అప్పుడప్పుడు చేసి పెట్టండి. ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది.

తదుపరి వ్యాసం