తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercise | వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలంటారు.. ఎందుకు?

Exercise | వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలంటారు.. ఎందుకు?

28 February 2022, 16:49 IST

google News
    • ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. అయితే వారంలో ఏడు రోజులు వ్యాయామం చేయాల్సిన అవరసం లేదు. తప్పనిసరిగా వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలి.
వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలి
వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలి (pexels)

వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాలి

వారంలో ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వ‌డం వ‌ల్ల శ‌రీర క‌ణ‌జాలానికి మ‌ర‌మ్మ‌త్తులు జరుగుతాయి. ప్ర‌తి రోజూ వ్యాయామం చేస్తే.. దెబ్బతిన్న కణజాల మరమ్మతుకు సమయం దొరకదు. దీంతో ఎముకలు, కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. 

అమెరికన్ ఫిట్‌నెస్ సంస్థ ఏఐటీ మెథడ్ దీనిపై ప‌రిశోధ‌న‌లు చేసింది. 2వేల మంది ఇందులో పాల్గొన్నారు. వీరిలో కొంత మందిని 7 రోజులు వ్యాయామం చేయించారు. మరికొంతమందిని ఆరు రోజులు వ్యాయామం చేయించారు. ఆరు రోజులు చేసిన వారు ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఏడు రోజులు చేసిన వారిలో ఎముకలు విరగడం, ఒత్తిడి కనిపించడం తదితర సమస్యలు కనిపించాయి.

విరామంతో ప్రశాంతత

అందుకే వ్యాయామం నుంచి ఒక రోజు విరామం తీసుకోవడం కండరాలకు మాత్రమే కాదు.. మానసిక స్థితికి కూడా మేలు చేస్తుందట. విశ్రాంతి తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ప్రసవమయ్యాక కొన్నాళ్ల పాటు వ్యాయామం నుంచి స్వల్ప విరామం తీసుకోవాలి. సిజేరియన్ లేదా సహజ ప్రసవమైనా దాదాపు రెండు నెలల పాటు కసరత్తుల వైపు కన్నెత్తి చూడొద్దు. 

ఒత్తిడితో కూడిన జీవనశైలిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి. అయితే మన శరీరం వ్యాయామం వల్ల మరింత ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం