తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skipping | పావు గంట స్కిప్పింగ్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం

Skipping | పావు గంట స్కిప్పింగ్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం

28 February 2022, 17:01 IST

  • Skipping | ఫిట్‌నెస్‌పై అందరికీ అవగాహన పెరిగింది. కొంద‌రు జిమ్‌ల‌కు వెళితే మరి కొంద‌రు ర‌న్నింగ్, సైక్లింగ్.. ఇంకొంద‌రు స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు. అయితే స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

స్కిప్పింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది
స్కిప్పింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది (pexel)

స్కిప్పింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది

స్కిప్పింగ్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. రోజూ పావుగంట స్కిప్పింగ్ చేస్తే దాదాపు 300 క్యాలరీలు ఖర్చవుతాయి. స్కిప్పింగ్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

- వ్యాయామం చేసేందుకు స‌మ‌యం ల‌భించ‌ద‌ని భావించేవారు స్కిప్పింగ్ చేయొచ్చు. సాయంత్రం వేళల్లో కూడా స్కిప్పింగ్ చేయొచ్చు. 

- స్కిప్పింగ్ వల్ల గుండె మెరుగ్గా పనిచేస్తుంది. మాన‌సిక ఆరోగ్యం మెరుగువుతుంది.

- స్కిప్పింగ్ వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.

- రోజూ స్కిప్పింగ్ వ‌ల్ల కండ‌రాల‌కు బ‌లం చేకూరుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఆందోళ‌న‌, ఒత్తిడి, డిప్రెష‌న్ త‌గ్గుతాయి. 

- స్కిప్పింగ్‌కు ముందు 10 నిమిషాలు వార్మ‌ప్ చేయ‌డం మంచిది. అలాగే షూస్ ధరించి స్కిప్పింగ్ చేస్తే కాలి వేళ్లపై ఒత్తిడి పడదు

స్కిప్పింగ్ ఎవరెవరు చేయకూడదు?

- గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు స్కిప్పింగ్‌కు బదులు తేలికైన వ్యాయామాలు ఎంచుకోవాలి. 

- ఏదైనా శస్త్రచికిత్స జరిగితే... డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే స్కిప్పింగ్ చేయాలి.

- అధిక రక్తపోటు ఉన్నవారు కూడా స్కిప్పింగ్‌ను స్కిప్ చేయాలి. ఎముకలకు సంబంధించిన సమస్య ఉన్న వారు స్కిప్పింగ్ చేయవద్దు.

తదుపరి వ్యాసం