తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Rice Recipe: ఇంట్లో కూరగాయలు లేకపోతే ఇలా ‘నెయ్యి అన్నం’ చేసుకోండి, వెరీ టేస్టీ రెసిపీ

Ghee rice Recipe: ఇంట్లో కూరగాయలు లేకపోతే ఇలా ‘నెయ్యి అన్నం’ చేసుకోండి, వెరీ టేస్టీ రెసిపీ

Haritha Chappa HT Telugu

03 January 2024, 11:08 IST

google News
    • Ghee rice Recipe: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకునే ఒక సింపుల్ రెసిపీ ఉంది. అదే నెయ్యి రైస్.
నెయ్యి అన్నం రెసిపీ
నెయ్యి అన్నం రెసిపీ (wikipedia)

నెయ్యి అన్నం రెసిపీ

Ghee rice Recipe: కూరగాయలు ఇంట్లో లేనప్పుడు లంచ్, డిన్నర్లో ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటప్పుడు నెయ్యితో ఇలా రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు అందుతాయి. దీన్ని చేయడం చాలా సులువు. బియ్యం, నెయ్యి, మసాల దినుసులు ఉంటే చాలు ఇది రెడీ అయిపోతుంది. నెయ్యన్నం రెసిపీ ఎలాగో ఒకసారి చూద్దాం.

నెయ్యన్నం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

నెయ్యి - మూడు స్పూన్లు

యాలకులు - రెండు

లవంగాలు - రెండు

బిర్యానీ ఆకు - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క

మరాఠీ మొగ్గ - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - మూడు

జీడిపప్పు తరుగు - ఒక టేబుల్ స్పూన్

నెయ్యి అన్నం రెసిపీ ఇదిగో

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో బాస్మతి బియ్యాన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసి అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

3. అందులో కప్పు బాస్మతి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను పోయాలి. అందులోనే బియ్యాన్ని కూడా వేసి ఉడికించాలి.

4. అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.

5. వండిన అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూను నెయ్యిని వేయాలి.

7. ఆ నెయ్యి వేగాక జీడిపప్పు పలుకులు, అర స్పూను జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

8. స్టవ్ కట్టేసి ఆ నెయ్యిలో ముందుగా వండుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. అంతే నెయ్యి అన్నం రెడీ అయినట్టే.

9. ఇది రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం