తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Glowing Skin | ముఖంలో నిగారింపును సహజంగా పొందాలా? ఆముదం నూనెతో ఇలా చేయండి!

Glowing Skin | ముఖంలో నిగారింపును సహజంగా పొందాలా? ఆముదం నూనెతో ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 14:15 IST

    • వర్షాకాలంలో చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరం. మీ ముఖం మొటిమలు, మచ్చలతో నల్లగా తయారైతే ఆముదం నూనెను ఉపయోగించి ముఖం కోల్పోయిన నిగారింపును, ప్రకాశాన్ని తిరిగి తీసుకురావచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
Glowing Skin
Glowing Skin (Unsplash)

Glowing Skin

ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకతమైనది. ఈ మాసంలో పండుగలు, పర్వదినాలు, ఉపవాసాస దీక్షలతో జనం భక్తిభావాలను కలిగి ఉంటారు. ఆహారం విషయంలోనూ నియమాలను పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కొన్నిరోజుల పాటు విడివిడిగా ఉంటారు. నవ వధువు తన పుట్టింటికి వెళ్లి ఈ నెల పూర్తయ్యే వరకు తన కుటుంబంతో గడపుతుంది. అలాగే మునగకాయలను ఈ కాలంలో ఎక్కువగా తింటారు. వస్త్రవ్యాపారం చేసేవారు ఈ ఆషాఢ మాసాన్ని శుభప్రదంగా భావిస్తారు. బోనాల పండుగ కూడా ఇదే మాసంలో వస్తుంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకును పెట్టుకుంటారు. ఈ మాసంలో పంచమి లేదా ఏకాదశి రోజున స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనక అనేక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి.

గోరింటాకు పెట్టుకోవటం వెనక ఉద్దేశ్యం

ఈ సీజన్‌లో ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, సీజనల్ ఇన్‌ఫెక్షన్లను నివారించటమే ప్రధాన కారణంగా చెప్తారు. భారతీయ సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఎక్కువగా ఇంటిపనులు, వంట పనుల్లో నిమగ్నం అయి ఉంటారు. వారి చేతులు నీటితో నిరంతరం సంపర్కంలో ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ ఉంటాయి. నీటిలో ఎక్కువసేపు గడపడం వలన కాళ్లలో పగుళ్లు ఏర్పడి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ మొదలగు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి చేతులకు, అరికాళ్లకు నిండుగా గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది కవచంలాగా పనిచేసి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

అంతేకాదు గ్రీష్మ రుతువు సమయంలో శరీరంలో వేడి నిక్షిప్తం అయి ఉంటుంది. వర్ష రుతువులో బయట వాతావరణం అందుకు విరుద్ధంగా చల్లగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకు కూడా గోరింటాకు ఒక కూలింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. శరీరంలోని వేడిని ఇది తొలగిస్తుంది.

ఈ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా, ఎర్రగాపండిన గోరింటాకు ఆడవారి చేతులు, కాళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే ఆశాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. యువతులు పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త దొరుకుతాడని ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది.

కాబట్టి ఆడవారు మంచి డిజైన్లను ఎంచుకొని, మీకు నచ్చినట్లుగా గోరింటాకు పెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మార్కెట్లో దొరికే మెహెందీ కోన్‌ల కంటే సహజంగా లభించే గోరింటాకు మేలు. గోరింటాకు ఆకులను సేకరించి, అందులో కొంచెం కాసును కలుపుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే మెరుగైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

టాపిక్