Beauty Tips | మచ్చలేని ముఖారవిందం కోసం.. హనీ ఈజ్ ద బెస్ట్!
05 July 2022, 8:03 IST
- ముఖానికి ఏవేవో క్రీములు, వివిధ రకాల ఉత్పత్తులు వాడనవసరం లేదు. సహజంగా లభించే తేనేతో అనేక పరిష్కారాలను చూపవచ్చు. ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకోండి...
Beauty Tips
చర్మ సౌందర్యానికి మార్కెట్లో ఇప్పుడు అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన ఉత్పత్తులు దీర్ఘకాలంగా వాడటం వలన చర్మం జీవం కోల్పోతుంది. అలాగే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి, కాంతి విహీనంగా తయారవుతుంది. ఇలా చర్మానికి హాని కలిగించే ఉత్పత్తులకు బదులుగా సహజ సిద్ధంగా లభించే తేనెను ఉపయోగిస్తే మచ్చలేని మెరిసే ముఖం సొంతం అవుతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు.
చర్మ సంరక్షణ కోసం తేనెను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది ఎంతో ప్రభావంవంతమైనది. అంతేకాకుండా సహజసిద్ధంగా లభించేది కావడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు అంటున్నారు. మీ చర్మ సంరక్షణ దినచర్యలో తేనెను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
క్లెన్సర్
మీ రోజూవారీ చర్మ సంరక్షణలో తేనెను చేర్చండి. తేనే సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, పగుళ్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది. క్లెన్సర్‌గా తేనె చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి అన్ని మురికి, దుమ్మును తొలగిస్తుంది. చర్మంలోని సెబమ్‌ను నేరుగా మూసివేస్తుంది, చర్మంలో తేమ నిలిపి ఉంచుతుంది. మీ చర్మాన్ని సమానంగా శుభ్రం చేయడానికి, మీ ముఖం రోజంతా తేమగా ఉంచడానికి సహజమైన రెమెడీగా తేనెను ఉపయోగించవచ్చు.
బాడీ స్క్రబ్బర్
మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం చేత తేనె చర్మానికి గొప్ప బాడీ స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరంపై పేరుకుపోయిన అన్ని రకాల మురికిని తొలగించి, చర్మం తేమగా ఉండేలా చర్మ రంధ్రాలను తెరుస్తుంది. తేనెలో సహజమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కణాలను రిపేర్ చేయగలదు. మీ మేని ఛాయను కాంతివంతంగా మారుస్తుంది. కొబ్బరి నూనె, నిమ్మరసం, చక్కెరను సమపాళ్లలో కలపడం వలన కూడా మీకు మీరుగా మంచి బాడీ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. మిశ్రమాన్ని స్క్రబ్ చేయడం ద్వారా, చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. దీనితో వారానికి రెండుసార్లు స్క్రబ్ చేసుకోవచ్చు.
మాయిశ్చరైజర్
తేనె సహజమైన, శక్తివంతమైన హ్యూమెక్టెంట్. ఇది చర్మాన్ని ఎక్కువ కాలం తేమగా ఉంచుతుంది. తేనెలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలుపుకుంటే అదొక మంచి మాయిశ్చరైజర్ అవుతుంది. మెరుగైన ఫలితాలు ఉంటాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి ప్రతిరోజూ దీన్ని అప్లై చేయండి.
పెదవులకు లిప్ బామ్
తేనె అద్భుతమైన మాయిశ్చరైజింగ్, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. పగిలిన పెదాలకు ఇది ఉత్తమ పరిష్కారం . కెమికల్ రిచ్ లిప్ బామ్‌లు తాత్కాలిక పరిష్కారాన్ని అందిస్తాయి. మీ పగిలిన పెదాలకు తేనెను అప్లై చేసి 5-10 నిమిషాల పాటు ఉంచితే పెదాలు నునుపుగా మారతాయి, మంచి రంగును పొందుతాయి.
ఫేస్ మాస్క్
మీది పొడి చర్మం అయితే మీ చర్మ సంరక్షణలో హనీ మాస్క్ వేసుకోండి. తేనే, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, నిమ్మరసం సమపాళ్లలో కలిపి హమీ మాస్క్‌ను తయారు చేయండి. ఈ పదార్థాలన్నింటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ముఖంపై అన్ని రకాల మచ్చలను తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.