Barre Workouts । మీకు ఫన్ ఇంకా ఫిట్‌నెస్ రెండూ కావాలంటే ఇలంటి వ్యాయామం చేయండి!
16 October 2022, 7:20 IST
- Barre Workouts: వారాంతంలో ఇంట్లోనే ఉండి చేసుకునేందుకు లేదా అందరూ కలిసి ఒక గ్రూప్ గా చేసుకునేందుకు బార్ వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఎలా చేయాలి? ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
Barre Workouts
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఉండటానికి ప్రతిరోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి లేదా వారాంతంలో అయినా కనీసం రెండున్నర గంటలు చమటోడ్చాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయలేనివారు, ఇలా వారాంతంలోనైనా వ్యాయామం చేయాలని నిపుణులు సలహా.
మరి వారానికి ఒక్కసారి లభించే వీకెండ్‌లో కొంచెం ఫన్ కొంచెం ఉండేలా వర్కవుట్స్ ఎంచుకోవచ్చు. ఇలా వ్యాయామం అవుతుంది, సరదాగా కూడా ఉంటుంది. అలాంటి వ్యాయామ రకాలు ఏమున్నాయి అనుకుంటే మీరు Barre Workouts చేయవచ్చు.
ఈ పేరు చూసి ఇదేదో బర్రె వ్యాయామాలు, గేదే వ్యాయామాలు అనుకోవద్దు. దీనిని బార్ వర్కవుట్స్ అని పిలవాలి. ఒక హ్యాండిల్ బార్‌ను పట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఈ Barre Workouts అనేవి బ్యాలెట్ ఆధారిత డాన్స్ వర్కౌట్లు. బ్యాలెట్ డ్యాన్సర్‌లు తమ డాన్స్ రకాన్ని Barre అని పిలుస్తారు. ఈ డాన్స్ రకంలో కదలికలు వివిధ కండరాలకు మంచి వ్యాయామాన్ని కల్పిస్తుండటంతో జుంబా లాంటి డాన్స్ ఏరోబిక్స్ లాగే ఈ బార్ వర్కవుట్స్ కూడా చేయడం మొదలైంది.
How to do Barre Workouts- ఎలా చేయాలి?
బార్ వర్కవుట్లు ఎలా ఉంటాయంటే కొన్ని శాస్త్రీయ నృత్య కదలికలు, యోగా భంగిమలు, పైలేట్స్ వంటి వాటిని మిళితం చేసినట్లుగా ఉంటాయి. ఈ వ్యాయామాలు చేయడానికి ఏదైనా సపోర్ట్ అవసరం. సాధారణంగా స్టూడియోలలో ప్రత్యేకమైన బార్ బ్యాండ్‌లు, యోగా పట్టీలు, వ్యాయామ బంతులు, చేతి బరువులు అవసరం అవుతాయి. ఏవీ లేకపోయినా ఒక కూర్చి సపోర్ట్ తీసుకొని ఆచరించవచ్చు. వాల్-మౌంటెడ్ బార్ స్థానంలో డైనింగ్ చైర్ లేదా మరేదైనా వస్తువును పట్టుకోవచ్చు. ఏవీ లేకపోయినా ఖాళీ చేతులతోనూ శరీరాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు. ఇవి తేలికైన వ్యాయామాలు సాధారణంగా నాడీకదలికలపై దృష్టి పెడతాయి, అలాగే బాడీ షేప్, స్ట్రక్చర్ సహా మొత్తం శరీర ఆకృతిని మార్చటం కోసం ఇవి చేయవచ్చు.
Barre Workouts Benefits ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
బార్ వర్కవుట్ల వలన మీ ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది, మీ ఫ్యాట్ తగ్గి మంచి శరీరాకృతి పొందవచ్చు, నిలబడే భంగిమలను మెరుగుపరుచుకోవచ్చు, కండరాలు బలోపేతం అవుతాయి, కడుపు కండరాలను టోన్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మెరుగైన మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం లభిస్తాయి. ఇంకా ఈ వర్కవుట్స్ చేయడం మంచి వినోదపు అనుభూతిని ఇస్తుంది. ఇవి ఎవరైనా చేయవచ్చు, ఏ వయసు వారైనా చేయవచ్చు.